గురువంటే ఆరని ఒక జ్ఞానదీపం..!: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
గురువంటే..?
అజ్ఞానపు చీకటిని
చీల్చే ప్రచండ సూర్యుడు...
శిష్యుల భవిష్యత్తును
అందంగా చెక్కే
ఒక అపూర్వశిల్పి...

గురువంటే..?
విజయ దర్పణంలో
మెరిసే నిత్య ప్రతిబింబం
గుండె లోగిళ్లలో
వెలిగే అఖండ జ్ఞానదీపం...

గురువంటే..?
అజ్ఞానపు
సుడిగుండంలో
కాపాడే వజ్ర కవచం...
శాంతి సముద్రాన
దారిచూపే స్థిర దీపస్తంభం...

గురువంటే..?
గెలుపు గుర్రంపై
మ్రోగే జయ విజయభేరి...
శిష్యుడి శిరస్సుపై
మెరిసే కోహినూరు వజ్రం...

గురువంటే..?
జీవిత పయనంలో
వెన్నంటి నిలిచే ఊతకర్ర...
కష్టాల గాయాల్ని మాన్పే
దివ్యమైన మత్తుమందు...

గురువంటే..?
అంధకారపు దారిలో
వెలుగులీనే కాంతికిరణం...
శ్రమజీవి చెమట
చుక్కల్లో విరిసిన మందహాసం...

గురువంటే..?
జ్ఞానామృతాన్ని
కురిపించే అమృత మేఘం...
అజ్ఞానాన్ని తుంచే వజ్రాయుధం...
విజయాలను మోసుకొచ్చే చైత్ర వసంతం...

అట్టి గురుదేవులకు చేద్దాం...
గురుదక్షిణగా...పుష్పాభిషేకం...
శిరసులువంచి వారి పాదాలకు పాలాభిషేకం.



కామెంట్‌లు