ఎర్ర రంగు చిలుకలు : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
ఎర్రెర్ర రంగు చిలుకలు 
ఎర్ర నైనా ముక్కుతో
ఎంతో బాగున్నాయి 
ఎగురుతూ వచ్చాయి 

కొమ్మమీద వాలాయి 
నిమ్మలంగా ఉన్నాయి 
కమ్మనైన పలుకులతో 
రా రమ్మని పిలిచాయి 

చిలక పలుకులింటుంది
చలాకి చూపుల పాపాయి 
కిలకిల నవ్వుతూ వస్తుంది
నెల వంకలా నిలుస్తుంది 

పాపను చూసినా చిలకలు 
దాహం దాహం అంటాయి
చెలమల నీళ్లు తెస్తుంది 
చిలకలకలకు పాప ఇస్తుంది 

జలకము తాగినా చిలుకలు 
ఫలములు తెచ్చి ఇస్తాయి 
బుట్టలో నింపుకొని ఆ పాప 
పిల్లలందరికీ పంచుతుంది 


కామెంట్‌లు