వికారాబాద్ జిల్లా పెద్దేముల్ కేజీబీవీ పాఠశాలకు చెందిన వి. చిట్టి బాయ్ గతనెల 17, 18 తేదీలలో వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి సౌత్ జోన్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీల ఎంపికలో పాల్గొని, క్రీడా నైపుణ్యతను, క్రీడా ప్రతిభను చాటి జాతీయస్థాయి జూనియర్ బాలికల షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఎం. రాజేశ్వరి, పీఈటి ఏ .గోపిక ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. జాతీయస్థాయి జూనియర్ బాలికల షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన వి.చిట్టి బాయ్ ఈ నెల 6 నుండి 9 వరకు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటుందని పిఈ టి ఎ. గోపిక తెలిపారు. ఇంతకుముందు 20025 డిసెంబర్ 29 నుండి 31 వరకు వరంగల్ జిల్లా అన్నారం లో జరిగిన సీనియర్ మహిళా షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొని మెడల్ సాధించినది. అలాగే 2025 డిసెంబర్ 14న తాండూర్ పట్టణంలో జరిగిన అస్మిత ఖేలో ఇండియా షూటింగ్ బాల్ మహిళల పోటీలలో పాల్గొని ప్రశంసా పత్రం పొందినది. జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు ఎంపికైన వి. చిట్టి బాయి ని, అందుకు కృషి చేసిన కేజీబీవీ పాఠశాల పి ఈ టి ఏ. గోపికను , వికారాబాద్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాములు , రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి గోపాలం,స్పెషల్ ఆఫీసర్ ఎం. రాజేశ్వరి, గ్రామ సర్పంచ్ ,వార్డు సభ్యులు, పెద్దలు, ప్రజలు అభినందించారు.
వి. చిట్టి బాయ్ కి అభినందన : వెంకట్, మొలక ప్రతినిధి
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి