ఆకుపచ్చని గాలి! : - డా.ప్రతాప్ కౌటిళ్యా
విశ్వ విస్ఫోటనా శబ్దాన్ని 
వినిపించకుండా చేసిన -గాలి.
సుగంధపు వనాల పరిమళాలను 
మోసుకొచ్చిన - గాలి.

సీతాకోకచిలుకల తోటల్లో 
మాటల పాటలను వినిపించిన- గాలి.
చీకటి ఉయల్లో జాబిల్లికి జోల పాడిన 
గాలి. 

దుర్గం దాన్ని గంధంగా మార్చిన గాలి 
ఉచ్వాస-నిచ్వాసాల్లో- స్వేచ్ఛ -గాలి .
ఎక్కడెక్కడో ఎగిరినా-- ఇగిరిపోని గాలి 
మాట్లాడని మనసులా కళ్ళకు కనిపించనిగాలి 

పెదాల వేదికల్లో కదిలే కథానాయక గాలి 
పుస్తకాల్లో మస్తీస్కాల్లో మెరిసే అక్షరాల స్వరాలు 
గాలి. 
ఆకాశానికి ఊపిరి పోసి వేణువుగా మారిన గాలి 
సముద్రపు అఘాతాల్లో బ్రతుకుతున్న ఆణిముత్యం గాలి.

చీకటికి కాపలా కాసే కీచురాళ్ళ గొంతు చప్పుళ్ళు గాలి 
మాటల కోటల్లో పెద్ద పెద్ద పాలరాతి భవనాలు గాలి 
ఎత్తుకు పై ఎత్తు ఎగిసి పడే అలల సముద్రం గాలి 
తంత్రాల కుతంత్రాల అంతరంగాల ఆత్మల తరంగాలు గాలి. 

ఈ భూమిపై ఆకుపచ్చని గాలి 
ఎరుపు రక్తపు గాలి. 

డా.ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు