విలువైన వజ్రాలు: - A. హర్షిత-10.వ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు - బెజ్జంకి -9441744333


 రామాపురం అనే ఊరిలో నర్సమ్మ, రాజయ్య దంపతులు పిల్లలు పుట్టక చాలా రోజులు అవుతుంది. ఎన్నో నోములు వ్రతాలు చేశారు దేవాలయాలకు మొక్కులు తీర్చుకున్నారు డాక్టర్ల దగ్గర చూపించుకున్నారు.తిరగగా తిరగగా  ఇద్దరు కవల పిల్లలు పుట్టారు.వారి పేర్లు సీత గీత ఇద్దరు అక్క చెల్లెలు కలిసిమెలిసి ఉండేవారు. ఆడుకునేవారు.పాఠశాలకు వెళ్లేవారు. వచ్చిన తర్వాత విషయాలన్నీ కూడా అమ్మ నాన్నతో ముచ్చటించేవారు గీత అంటుంది వాళ్ళమ్మతో అమ్మాయి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ అంటుంది అప్పుడు అమ్మ అడుగుతుంది ఎందుకమ్మా అని పాఠశాలలో బతుకమ్మ పండుగ జరిగిందమ్మ అందరం బతుకమ్మను ఆడుకొని తర్వాత  పట్టుకొని చెరువుకు వెళ్లి చెరువులో వేసాం.అమ్మ సంతోషంగా అనిపించింది. చూస్తూ ఉండగా ఒక రోజు వాళ్ళ నాన్నగారికి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్పించారు దానితో సీత గీత ఇద్దరు కూడా పరీక్షలు రాయలేకపోయారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు.
 ఇంటి పని చేస్తూ అమ్మను చూసుకుంటూ కానీ అప్పులోళ్ళందరూ వచ్చేసి ఇంటి ముందట గొడవ చేస్తూ ఉన్నారు అమ్మ స్పృహతప్పి పడిపోయింది ఆస్పత్రికి తీసుకుని వెళ్తే డాక్టర్ చూసి వాళ్ళిద్దరికీ ఒక విషయం చెప్పారు మీ అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది కోల్పోవడం కష్టమని సీత గీత చాలా ఏడ్చారు. అప్పుడు కొంచెం సీత ధైర్యం తెచ్చుకొని గీత ఎదవకు అమ్మకి ఏం కాదు అంది నేను పనిచేస్తాను నీవు బయటికి వెళ్లి చదువుకోమని చెప్పి గీతను బడికి పంపించి సీత పనుల్లో చేరింది.
 నా పెరడులో కూరగాయలు ములక్కాయలు పెట్టి వచ్చిన కూరగాయలను అమ్ముతూ బతుకుతున్నారు ఒకరోజు తోట్లో తవ్వుతుండగా ఒక శబ్దం వినబడింది ఆ శబ్దం ఏమిటి అని ఇంకా లోతుకు తవ్వి చూసింది ఒక చిన్న బిందె కనిపించింది ఆ బిందెను ఇంటికి పట్టుకుని వెళ్ళింది అమ్మ నా చిన్న బింద దొరికింది ఆ బిందెలో ఏమున్నాయి అని చూస్తే బంగారు నాణాలు ఉన్నాయి అప్పుడు గీత పాఠశాల నుండి ఇంటికి వచ్చింది సీత గీతకు విషయం చెప్పింది బిందె దొరికింది అని మన కూరగాయల తొట్లో తవ్వుతుండగా ఆ ఖండన శబ్దం వినబడింది ఏమిటని చూసి ఇంకా లోతుకు తవ్వితే ఈ బింద దొరికింది. ఆ మాట విని వెంటనే గీత అక్క ఇంకా మన కష్టాలు పోతాయి అని అన్నది అప్పుడు వాళ్ళ అమ్మ అన్నది ఇలా మనకు దొరికిన సొమ్ము తీసుకోకూడదమ్మ ప్రభుత్వం వారికి అందజేయాలి అని చెప్పింది ఆ మాట విని గీత ఎందుకమ్మా కష్టాలలో ఉన్నాం మనం ఈ దెబ్బ వాడుకుందాం అంటారు అమ్మ వద్దంటది సీత కూడా ఆ భిన్నం తీసుకుని వెళ్లి సర్పంచ్ గారికి ఇచ్చి గవర్నమెంట్ వాళ్లకు అప్పుడు వారి నిజాయితీకి మెచ్చుకొని కొంత డబ్బులు బహుమానంగా ఇస్తారు.
 ఆ డబ్బులు తీసుకొని అప్పులు తీర్చేసి కొంత డబ్బులు మిగిల్తే వాళ్ళ అమ్మకు వైద్యం కోసం ఖర్చు పెట్టారు కొంత డబ్బులు దాచుకున్నారు సీత గీత మళ్లీ ఈ పరీక్షలు వచ్చాయి పరీక్షలు రాసి సీత గీత ఇద్దరు కూడా ప్రథమ స్థానంలో పాస్ అయ్యారు వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది పూరి వాళ్ళందరూ కూడా ఆ పిల్లల యొక్క కష్టానికి జ్ఞానానికి మెచ్చుకుంటారు 
 ఏదైనా విలువైన వస్తు దొరుకుతే అది మన సొంతం కాదు కష్టపడి సంపాదించిందే మన సొంత వస్తువు అవుతుంది 
కామెంట్‌లు