వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
95. కులయోగినీ (పంచాక్షరీ)
96. అకులా (త్ర్యక్షరీ)
తొంభై ఆరవ నామ మంత్రము -
ఓం అకులాయై నమః
గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం - ఇవి పంచభూతాలు అయితే, ఈ పంచభూతాల కలయికతో ఏర్పడేది, మానవ శరీరం. ఈ పాంచభౌతిక శరీరానికి రూపము, వంశము, కులము, జాతి వంటివి అంటుకుని ఉంటాయి. కానీ, వీటన్నిటికీ దూరంగా, ఇవి ఏవీ అంటని, ప్రాణము, కులశబ్దమూ లేని / అంటని పరమేశ్వరి గా కనిపిస్తున్న జగజ్జనని ని చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "అకులా" అని కీర్తించారు. ఏ రూపమూ, ప్రాణమూ లేకుండా ఉన్న పరాత్పరికి నమస్కారము.
సుషుమ్ననాడి క్రింద, పైన ఒక్కొక్క సహస్ర దళ పద్మము ఉంటుంది. క్రింది పద్మము "కులము" అయితే, పైని పద్మము "అకులము". శరీరము, వంశము లేనిది "అకులా" అవుతుంది. ఈ సుషుమ్ననాడి పైన ఉన్న సహస్ర దళ పద్మము యొక్క రేకులలో విరాజమానయై ఉన్నది శ్రీమాత. అందువల్లనే శ్రీమహారాజ్ని "అకులా" అని పిలువబడుతోంది.
"అకులా" గా అమ్మ విరాజమ్నయైన సహస్రదళ పద్మానికి, అష్ట దిక్కులకు ప్రతీకగా ఎనిమిది పెద్ద దళములు / రేకులు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క రేకుకు 125 చిన్న చిన్న దళములు ఉంటాయి. ఈ విధంగా సహస్ర దళ పద్మములో మొత్తం వేయి దళములు / రేకులు ఉంటాయి.
మానవ శరీరం లో కూడా రెండు పద్మాలు ఉంటాయి. ఆధారచక్రానికి క్రింద ఒకటి, ఆజ్నాచక్రానికి పైన ఒకటి. సాధకులు తమ సాధనతో, కుండలినీ శక్తిని ప్రేరేపించి, ఆజ్నాచక్రములో "అకులా" గా ఉన్న పరాత్పరిని చేరుకోవడానికి చేసే సాధనా మార్గమే, అతి నిగూఢమైన "శ్రీవిద్య".
అంతటి కఠోరమైన తపస్సు / సాధన చేసి "అకులా" గా ఉన్న తనను చేరడానికి తపించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం అకులాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి