నీవు వరములను ఇచ్చుచున్నావు
నీవు పలికిన మాటలు దేవతలిన్నారు
దివి, భువి నీ ప్రతిజ్ఞను విన్నారు
ఓ రాజా! ఆనాడు దైవసురునితో
జరిగిన పూర్వ యుద్ధమున నీకు
శత్రుభాణాలు తాకి మూర్చిల్లితివి
ఆరోజు నేను నిన్ను కాపాడితిని
ఆ సంతోషమున రెండు వరములను
నాకు ఇచ్చితివి ఆ వరములనిపుడు
నిన్ను నేను కోరుచున్నాను రాజా!
ధర్మమునకు కట్టుబడి వరములివ్వుము
నీవు ఆ వరములను తిరస్కరించినచో
నా నాప్రాణములను త్యజించెదను
శ్రీరాముని వనమునకు పంపి
భరతునకు పట్టాభిషేకము చేయుము
ఇప్పుడేరాముడు వనమునకెళ్ళవలెను
భరతుడు యువరాజుగా యుండవలెను
రాజులకే రాజువు సత్యము నిలుపుము
నీ వంశశీలమును రక్షించుము రాజా!
==========================
అయోధ్యకాండమందు 11వ సర్గ సమాప్తము🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి