శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - - 122
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
101. మణిపూరాన్తరుదితా (అష్టాక్షరీ)
102. విష్ణుగ్రంధివిభేదినీ (అష్టాక్షరీ)
నూట రెండవ నామ మంత్రము - 
  ఓం విష్ణుగ్రంధివిభేదిన్యై నమః
మూలాధార చక్రములో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి, పైకి ప్రయాణం చేస్తూ "సహస్రార చక్రము" క్రింద, పైన ఉన్న "బ్రహ్మగ్రంధు"లను భేదించి/విడదీసి, తన సాధకుని అజ్ఞానాన్ని పోగొట్టి, ఆ సాధకుని దృష్టిని / ఆలోచనలనూ నిత్యము, సత్యము అయిన వస్తువు వైపు తిప్పుతూ, "అనాహత చక్రము"లోనికి ప్రవేశించి "విశుద్ధి చక్రము"ను చేరడానికి ముందు వున్న "విష్ణుగ్రంధి"ని ఛేదిస్తున్నట్టుగా/ముడి విప్పుతున్నట్టుగా కనిపించిన శ్రీమహారాజ్నిని చూసి, వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "విష్ణుగ్రంధివిభేదినీ" అని పిలిచి కీర్తించారు. "విష్ణుగ్రంధివిభేదినీ" గా దర్శనం ఇస్తున్న జగన్మాతకు నమస్కారము.
బ్రహ్మగ్రంధులను విప్పడం ఇంతకుముందు నామంలో చెప్పుకున్నాము. ఇప్పుడు, ఈ నామంలో వచ్చే "విష్ణుగ్రంధి", మణిపూర, అనాహత చక్రముల పైన ఉంది.
పంచకోశములలో, భౌతిక తత్వాన్ని ప్రతిబింబించే అన్నమయకోశంలో, స్థూలశరీరానికి ప్రతీకగా ఉంది"బ్రహ్మగ్రంధి ". ఈ బ్రహ్మగ్రంధి భేదన ద్వారా సాధకులు అజ్నానాన్ని వదలి, ఈ స్థూలంగా కనిపించే భౌతిక రూపం కాకుండా, నిత్యమైన "పరబ్రహ్మ తత్వం" ఒకటి తనలోనే శాశ్వతంగా ఉంది, అనే స్ఫురణను పొందుతాడు అని తేలుసుకున్నాము. ఈ పరబ్రహ్మ తత్వంను తెలుసుకునే తన ప్రయత్నాలు కొనసాగిస్తూ, "భౌతిక శరీరం" కన్నా "స్థూల శరీరం"  గొప్పది అని తెలుసుకుంటాడు, సాధకుడు.
బ్రహ్మగ్రంధి భేదన ద్వారా, స్థూల శరీరాన్ని కొరి వచ్చిన వనిత, పర్యవసానంగా వచ్చిన సంతానాము, వీరంతా తనవారని, వారికి ఇంకా ఎక్కువగా ఏదేదో చెయాలని వచ్చే ఆలోచనలు, ఇవి అన్నీ కూడా "పరమేశ్వరి మాయ"గా గుర్తిస్తాడు సాధకుడు. ఈ మాయపొర చాటు తొలగిన సాధకుడు "నా వలననే ఈ జగత్తు మొత్తము నడుస్తోంది" అనే అహంకారాన్ని, అజ్నానాన్ని కూడా పోగొట్టుకుంటాడు. అత్యంత అందమైన, సత్యమైన ఆనందాన్ని ఇచ్చే "పరబ్రహ్మం" వైపు, పైపైకి తన ప్రయాణం సాగించాలి, అనే జ్ఞానాన్ని పొందుతాడు.
"విష్ణుగ్రంధి భేదన" తో సాధకులలో ఉన్న అజ్ఞానము, అహంకారము, నేను, నాది, నా వల్లనే అనే భావనలు అన్నీ పూర్తిగా తొలగిపోయి, ఇంకా తాను పొందవలసిన జ్ఞానాన్ని వెతుక్కుంటూ అమ్మ వైపు తన ప్రయాణం నిశ్చల చిత్తంతో, దశదళ పద్మములో ఉన్న సన్నటి దారాన్ని పట్టుకుని, చేయాలి అనే భావన సాధకునిలో స్థిరపడుతుంది.
ఈ విధంగా "విష్ణుగ్రంధి భేదన" ద్వారా తన సాధనా మార్గాన్ని సుగమం చేసుకుంటూ, తనను చేరాలి అని తపించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం విష్ణుగ్రంధివిభేదిన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం