వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
103. అజ్ఞాచక్రాంతరాళస్థా (అష్టాక్షరీ)
104. రుద్రగ్రంధివిభేదినీ (అష్టాక్షరీ)
నూట నాల్గవ నామ మంత్రము -
ఓం రుద్రగ్రంధివిభేదిన్యై నమః
ప్రతీ సాధకుని హృదయంలో ఉన్న "అనాహత చక్రము"లో రెండు గ్రంధులు ఉన్నాయి. ఈ రెండు గ్రంధులనూ భేదించి సాధకునికి మృత్యుబాధలను తొలగింపజేసి, చిదానంద స్థితిని కలిగిస్తూ దర్శనం ఇచ్చిన శ్రీచక్రరాజసింహాసనేశ్వరిని వశిన్యాది వాగ్దేవతలు "రుద్రగ్రంధివిభేదినీ" అని కీర్తించారు. సాధకుడననైన నాకు సహస్రార చక్రము లోకి ప్రవేశద్వారం తెరుస్తున్న పరమేశ్వరి అయిన జగన్మాత కు నమస్కారము.
జీవుని శరీరం లోపల బ్రహ్మ గ్రంధి, విష్ణు గ్రంధి, రుద్ర గ్రంధులు ఉన్నాయి. బ్రహ్మ పంచభూతాత్మకమైన శరీరం ను పుట్టిస్తే, విష్ణువు ఆ శరీరాన్ని వృద్ధి చేస్తాడు. రుద్రుడు, ఆ పాంచభౌతిక శరీరాన్ని మళ్ళీ పంచభూతాలలోనే లయం చేస్తాడు. హృదయం లోపల ఉన్న "రుద్రగ్రంధులు"గా చెప్పబడే రెండు గ్రంధులనూ భేదించి, సమస్తాన్ని లయం చెసిన కుండలినీ శక్తి రూపంలో ఉన్న పరమేశ్వరి అయిన శ్రీమాత సాధకునికి "అమృతత్వాన్ని" ప్రసాదిస్తుంది.
"మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా" చక్రములను కలిపి "కులము" అని కూడా చెప్పబడింది. ఇందులో మూడు దేవీ చక్రములు ఉన్నాయి. అవే, "బ్రహ్మ, విష్ణు, రుద్ర" గ్రంధులు. "బ్రహ్మ గ్రంధి" లో వున్న రెండు గ్రంధులలో ఒకటి "పృథివీ తత్వాన్ని", రెండవది "జల/ఉదక తత్వాన్ని" కలిగి ఉంటుంది. "విష్ణు గ్రంధి" లో వున్న రెండు గ్రంధులలో ఒకటి "వహ్నిమయ/అగ్ని తత్వాన్ని", రెండవది "సూర్యమయ/తేజోమయ తత్వాన్ని" కలిగి ఉన్నాయి. ఇవి వృద్ధిని ఇస్తూ, అన్ని సిద్ధులనూ కలిగిస్తూ ఉంటాయి. ఇక "రుద్ర గ్రంధి" లో "వాయురూప, ఆకాశరూప" తత్వాలు ఉంటాయి. బ్రహ్మ గ్రంధి భేదనముతో సృష్టి, జన్మ పద్ధతులను తొలగించి, "విష్ణు గ్రంధి" భేదనతో జీవి వృద్ధి దశలను తొలగించి, "రుద్ర గ్రంధి" భేదనతో లయాదులను కూడా నాశనం చేసి, సాధకునకు "చిదానంద స్థితి"ని కలిగిస్తూ ఉన్న పరమేశ్వరి ని "రుద్రగ్రంధివిభేదినీ" అన్నారు.
పైన చెప్పుకున్న "ఆత్మ జ్ఞానం" ను పొంది, సహస్రార కమలదర్శనం చెసుకోవడం కేవలం నిరంతర సాధకునికే సాధ్యం అవుతుంది. అందువల్లనే "సాధకులను, యోగులను" దూరం నుండి చూడగలిగినా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇటువంటి వారి పాద స్పర్శతో మనం చేసుకున్న వెనుక జన్మల పాపాలు కూడా నశిస్తాయి. మనకి ముముక్షత్వానికి దారి దొరుకుతుంది.
ప్రతీ నిత్యమూ శ్రీమాత సాధనలో ఉంటూ, సహస్రార చక్రము చెరుకోవడమే ధ్యేయంగా, తనను సేవించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం రుద్రగ్రంధివిభేదిన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి