ఇప్పుడు నీవిచ్చిన మాట తప్పుచున్నావు
దీనివలన నీవు అపకీర్తి పాలవుదు
నీవు చేసిన ప్రతిజ్ఞ వమ్ము చేయదవద్దు
రామునికి గాక భరతునికి పట్టముగట్టుట
ధర్మమో, ఆధార్మమో నేనెరుగను
రాముని వనములకు పంపుమని
నేను కోరుట యుక్తమో అయుక్తమో
నీవు నాకు ఇచ్చిన వాగ్దానము
వ్యతిరేకంగా జరుగుటకు వీలు లేదు
నీవు రామునికి పట్టాభిషేకమం చేసినచో
నీ ముందే విషము త్రాగి తెలుగు చనిపోయెదను
రామునికి వనవాసము
భరతునికి పట్టాభిషేకము అనిన
కైకేయికి సంతోషకరములు
దశరథునికి మాత్రము దుఃఖకారకములు
ఓ కఠినాత్మురాలా! నా వలన గాని
ధర్మాత్ముడైన రాముని వలన గాని
దుఃఖము కలుగునని తలంచుచుంటివి
ఎట్టి బాధలు నీకు రావు ఓ కైకేయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి