12వ సర్గ: - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


రాముడు,భరతుడు పుత్రులందువు నీవు
ధర్మాత్ముడైన శ్రీరామునిపై కోపమేల 
పదునాలుగు సంవత్సరములు
వనములో నివసించుట కష్టము కదా 

రాముడు భయంకరమైన అడవులలో 
నివసించుటలో నీకు ఏమీ ఆనందము
సదా వేళలో కూడా భరతుని కంటే 
శ్రీరాముడు నీ మీద గౌరవము చూపేవాడు 

ఎవరు కూడా శ్రీరాముని నిందించారు 
అతనిపై నీకు ఎందుకు ఈ దురాలోచన 
రాముడిని అడవులకు పంపుటకు 
నా మనసు అంగీకరించడము లేదు 

ఓ కైకేయి నేను వృద్ధుడను శేష జీవితము
దీనముగా విలపించుచున్నవాడను 
అట్టి నాపై నీవు కరుణ చూపలేవా
నాపై దయతో నీ మనసు మార్చుకో 

ఓకైకేయీ! చేతులు జోడించి అడుగుతున్న 
నీ పాదాలు కూడా పట్టుకుంటాను 
నా శ్రీరాముని దయతో రక్షింపుము
ఇచ్చటనే యుండుటకు అనుమతించు 

కామెంట్‌లు