12వ సర్గ : - ఎడ్ల లక్ష్మి- సిద్ధిపేట


ఓ కైకేయీ! రాముడు అడవికి వెళ్లితే 
సుకుమారమైన సీత తట్టుకోలేదు 
సోదరుడు లక్ష్మణుడు కూడా తట్టుకోలేడు 
తల్లి కౌసల్య విలవిలలాడిపోతుంది 

రాముడు అడవికి వెళ్ళిన తక్షణమే 
నా ప్రాణాలు కూడా పోతాయి 
విధవగా నీవు భరతునితో రాజ్యమేలు
అందుకే నీవు నా చావు కోరితివి 
నా పాలిటి శత్రువైనా మృత్యుదేవతవు 

భరతుడు రామలక్ష్మణులను నన్ను 
బంధువులను దూరం చేసి నీతో ఉంటాడు 
క్రూర గుణములు కలిగిన ఓ కైకేయీ!
రాముని అడవికి పంపలేక నేను బాధతో 
విలవిలలాడుతుంటే నీ వాయిగున్నావు 

మిక్కిలి దురాత్మరాలువై వంశమునకే
కళంకములు తెచ్చేటి దానవు 
నీవు కృంగి కృషించి నాశనమైపోయిన 
ఇష్టం లేని ఈ ధారణమును చేయలేను 

నాకు కీడు తలపెట్టవద్దని దశరథుడు 
దిక్కులేని వాడివలె విలపించచూ
మరొక్కసారి కైక కాళ్ళను పట్టబోయెను 
కాళ్లు తాకకుండనే అతడు కూలబడెను 

కామెంట్‌లు