-------------------
కైక దశరథునిభయమును పట్టించుకోక
వరముల గూర్చి మళ్లీ గుర్తు చేస్తుంది
ఓ రాజా! నేను సత్యవంతుడనని
ఎన్నోగొప్పలు చెప్పుకుంటివి కదా!
వరములు ఇచ్చుటకు ఎందుకని
వెనుకాడుచున్నావు నీకు అది తగునా
కైక మాటలు విని దశరథుడు కృద్ధుడై
రాముడెళ్లిన వెంటనే నా ప్రాణము పోవును
ఓ దుష్టురాల నా పాలిట శత్రువు నీవు
నా చావును చూసి హాయిగా యుండు
నేను స్వర్గము చేరినాక దేవతలందురు
భార్యకు బానీశుడవైనావని అంటారు
సంతానము లేక చాలా రోజులు
ఎంతో బాధతోయుండి యాగము చేశాను
యాగ ఫలితముతో పుట్టిన రాముని
నేను వనమునకు ఎలా పంపాలి
దశరథుడు బాధతో రేయిని మొక్కుతాడు
ఓ రాత్రి తెల్లవారకుండా అలానే యుండు
నన్ను కనుకరించు కైక ముఖము చూడలేను
గురువులకు సమాధానము చెప్పలేను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి