ప్రవాస పద్య పరిమళం - 29: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
అంశం : న్యస్తాక్షరి
వర్ణనాంశము : వ డ గా డ్పు
ఛందస్సు : చంపకమాల



“వ డ గా డ్పు “ వరుసగా..

1 వ పాదము 12 వ అక్షరము  = వ 
2 వ పాదము 4 వ అక్షరము = డ
3 వ పాదము 14 వ అక్షరము = గా
4 వ పాదము  20 వ అక్షరము = డ్పు

చంపకమాల:

భగభగ మండుటెండల ప్రభా(వ)ము జూపుచు భాస్కరుండు తా 
సెగలి(డ) భూమి తీవ్రముగ శీతల తత్త్వము గోలుపోవగా 
ధగధగలాడు తీక్షణ హుతాశన(గా) జగమెల్ల భగ్గనన్ 
వగచె సమస్త ప్రాణి జనవాసము సొక్కగ వేడిగా(డ్పు) లన్ 

హుతాశన = అగ్ని 
సోక్కగ = బడలిక,  నీరసము 

కామెంట్‌లు