మహారాజుఆజ్ఞమేరకు వశిష్ఠుడు సుమంత్రాధులను ఆదేశించుట -- దశరథుడు శ్రీరామునకు సూచనలు ఇచ్చుట
---------------------
చెట్ల చిగుర్లతో పుష్పాలతో చైత్రమాసము
మనోహరముగా శోభిలుచున్నది
రాముని పట్టాభిషేకమునకు అనువైనది
వశిష్టమహర్షి మీ ఆజ్ఞానుసారముగా
శ్రీరామునియువ పట్టాభిషేకమునకై
నిర్వహించవలసిన పనుల గూర్చి
నేడే బ్రాహ్మణులకు ఆజ్ఞాపించుము
వసిష్ఠుడు దశరథరాజు మాటలను విని
సుమంత్రాది సచివులకు అధికారులకు
వెండి బంగారము రత్నములను
పండ్లు ఫలములను పూజ సామాగ్రిని
వేరువేరు పాత్రలలో తేనెలను
శ్వేత వర్ణమున నూతన వస్త్రములను
రథమును వివిధ ఆయుధములను
చదరంగబలములను భుజంగములను
గంధపుష్పాది వస్తువులను సిద్ధపరచుము
వేలకొలది బ్రహ్మములకు సరిపడా
చిక్కని పాలతో తయారైన పాయసము
ఆహార పదార్థాలను సిద్ధపరుచుము

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి