మరుగున పడిన మగువలు39: -అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ

 డా.కె.జానకిగారి*Role of women infreedom struggle in Andhra Pradesh
తుమ్మల దుర్గాంబ 1907లో తురిమెళ్లలో పుట్టారు.అమ్మ నాన్నలు భూషమ్మ,పర్వతనేని కృష్ణయ్య. 11ఏళ్ల వయసులో బసవయ్యతో పెళ్లి,13వ ఏటనుంచి నూలు వడకటం ఖాదీ చీర కట్టడం అత్తగారింటి దేశభక్తి ఆచిన్నారికి అలవడింది. స్వామీ సీతారాం( గొల్లపూడిసీతారామశాస్త్రి)గారి ప్రభావంతో  గాంధీ అనుచరులైనారు ఆకుటుంబంలోనివారంతా!2అక్టోబర్ 1920న ఆమె హరిజన పిల్లలకి తలంటిపోసి, కొత్త దుస్తులు ఇచ్చి విందుభోజనం పెట్టి గాంధీజీ పుట్టిన రోజుని ఘనంగా చేశారామె.కావూరులో 1923లో తిలక్ నేషనల్ స్కూల్ పెట్టి ఆంగ్ల బడిలో ఉన్న వారిని అందులో చేర్చారు.చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి చర్ఖా ఖాదీ  జాతీయ గీతాలు నేర్పారు.గాంధీ కావూరు వచ్చి బాపూజీబాగ్ అనే కుటీరంలో హిందీ ప్రచారం,హరిజనసేవ ఆరంభించారు. 1931లో బాపూ విగ్రహాన్ని నెలకొల్పారు.ఉప్పుససత్యాగ్రహంలో పాల్గొని7జులై 1930లో వెల్లూరుజైలుశిక్ష అనుభవించారు.27జనవరి 1932లో 500రు.ఫైన్  వెల్లూరుజైలుశిక్ష  అనుభవించారు.స్వామిసీతారాం కావూరులో వినయాశ్రమం పెడితే ఆదంపతులు ఉన్న ఆస్తినంతా దానంచేశారు.దుర్గాంబ తన మెళ్లో బంగారు మంగళసూత్రాలు కూడా దానంచేశారు. గాంధీ ఆఆశ్రమానికి ప్రారంభోత్సవంచేశారు. దుర్గాంబ చేసిన ఇంకో పని ఏమంటే అన్ని ఊళ్లల్లో ఉన్న దేవాలయాల్లో హరిజనులకు ఆలయప్రవేశం కల్పించారు.1940లో కులమత వివక్షత లేకుండ పిల్లల అనాధాశ్రమం నెలకొల్పి ఇతర మహిళల తో కల్సి ప్రభాతభేరి,సత్యాగ్రహ విధులు నిర్వహిస్తూ దేశ సేవలో అంకితమైన కుటుంబంగా చరిత్ర లో నిలిచింది.తిలక్ నేషనల్ స్కూల్ రజతోత్సవాలకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్,వినోబాభావే వచ్చారు.దుర్గాంబ  బాల్వాడీని ప్రారంభించి అఖండసూత్రయజ్ఞంతో పాటు తుమ్మల సీతారామచౌదరికి తులాభారం చేయటం విశేషం.సామూహిక నూలు వడకటంతో పాటు చర్ఖాలు దుప్పట్లు, దుస్తులు పంచారు.కస్తూర్బా మెమోరియల్ ట్రస్ట్ ప్రొవెన్షియల్,  డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ గా ఆమె ఎనలేని సేవలు చేశారు.ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంకై కృష్ణ గోదావరిజిల్లాల్లో పాదయాత్ర చేశారు.తిరుపతి మద్రాస్ మీటింగ్స్ లో,నిరాహార దీక్షలో పాల్గొన్న దుర్గాంబ  తుఫాన్ వరదల సమయంలో అపార సేవ చేశారు.గాంధీ సుదర్శనం,ఆంధ్ర హరిజన్, సర్వోదయ,వన్యజాలి మొదలైన పత్రికల ప్రచురణలో ముఖ్య పాత్ర పోషించారు. ఆలిండియా ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ లో ఆమె పాత్ర ముఖ్యమైనది.కల్యాణ కావూరు అని కావూరు పేరు మార్చారు.కానీ తుమ్మల దుర్గాంబ పేరు సోదిలోకి లేకుండ పోవటం విచారకరం; వాసిరెడ్డి హనుమాయమ్మ 1910లో పుట్టారు తండ్రి దేవ భక్తుని వీరయ్య భర్త కోటయ్య చేబోలు నివాసం .ఈమె 7 మార్చ్ 1931లో వెల్లూరు జైలు నుంచి విడుదలైనారు .ఆ తర్వాత 23 జనవరి 1932లో తిరిగి వెల్లూరు కోయంబత్తూర్ లో జైలు శిక్ష అనుభవించారు. వట్టి కొండ హనుమాయమ్మ బాపట్లలో అరెస్టయి విడుదలై నారు .ఎల్లా ప్రగడ ఇందుమతీ దేవి 1918లో భట్టిప్రోలు రాజశేఖర్ దంపతుల కుమార్తె గా పుట్టారు. భర్త వెంకట సత్యనారాయణ మూర్తి. భార్యాభర్తలిద్దరూ జైలు శిక్ష అనుభవించారు .8 ఏప్రిల్ 1932లో ఆమె వెల్లూరు జైలులో ఉన్నారు .మంతేనా జానకమ్మ బాపట్ల తాలూకా వాసి .పికెటింగ్ చేసినందుకు ఊరికి చివర తీసుకెళ్లి ఆపై విడుదల చేశారు. గంధి జనార్ధన మ్మ గుంటూరు జిల్లాకు చెందిన .ఆమె  బాపట్ల లో అరెస్ట్ అయి విడుదలైనారు .కొల్లా జయలక్ష్మి త్రిపునేని దుర్వాసులు కూతురు. భర్త హనుమంతరావు పెదనందిపాడు నివాసి .ఈమె హిందీ విశారు ద పాసై 18 జనవరి 1932లో వెల్లూరు కన్న నూరులో జైలు శిక్ష అనుభవించారు. కమలాంబ నల్లూరు వాసి. ఈమె కూడా జైలు శిక్ష అనుభవించింది🌷

కామెంట్‌లు