మీ అమ్మకౌసల్య నాకు తగిన అర్ధాంగి
ఆమె గుణములు, అందమును
పునికి పుచ్చుకొని జన్మించిన రామా!
తల్లికి తగిన తనయుడవు నీవు
ఎల్లప్పుడూ జితేంద్రుడవై వెలుగుము
నీ రాజ్యం ఇతర రాజ్యము విషయాలు
తెలుసుకొని తగిన విధంగా వ్యవహరించు
స్వయంగా ప్రజల నుండి వాస్తవం నెరిగి
ప్రేమను పంచుతూ నీవు రాజ్యమేలు
పురవాసుల, జానపదుల, ప్రజల నెరిగి
వారిని చక్కగా పాలించుము రామా!
కోష్ఠాగారములు, ఆయుధగారములు
ధనధాన్యములతో ఆయుధాలతో నింపు
సామంతులు మొదలగు సప్తకృతులకు
అనురాగమ పంచుతూ రాజ్యమేలు
సామంతాదులు అమృతము పొందిన
అమరులవలే సంతోషిస్తారు
నా మనో నిగ్రహముతో నీకు తెలిపితిని
నేను తెలిపినట్టు రాజ్యపాలన చేయుము

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి