డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
దిగుమర్తి బుచ్చి కృష్ణమ్మ 1900లో పుట్టారు .తండ్రి దామెర్ల వెంకట రమణారావు .భర్త దిగుమర్తి హనుమంతరావుతూ.గో.జీ
సీతానగరం నివాసి. ఆమె ప్రాథమిక విద్య ఆపై హిందీ విశారద పాసైనారు .ప్రసిద్ధ ఆర్టిస్టు దామెర్ల రామారావు గారి సోదరి. ఆయనలాగా అద్భుతంగా చిత్రాలు గీసి గాంధీ మెప్పులు పొందారు. భర్తతో కలిసి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా ,హరిజన ఆర్గనైజేషన్ లో పనిచేశారు. పినాకిని ఆశ్రమాన్ని పల్లెపాడు లో హరిజనుల కోసం ప్రారంభించారు .ఆమె సత్యాగ్రహి గాంధీజీ అడుగుజాడల్లో నడిచారు .ఉప్పు సత్యాగ్రహం లో బాల్యంలోనే పాల్గొన్నారు. అఖండ సత్యాగ్రహం ,విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమాల్లో పాల్గొన్నారు. మహిళా మండలులను ఏర్పరిచి ఖాదిని ప్రచారం చేశారు. పోలీసులు ఆమె వెనకాలపికెటింగ్ చేస్తున్నప్పుడు నడుస్తుంటే తన ఖాది వస్తువులను వారి చేత మోయించేది .ఆబరువుతో పోలీసులు వెనక నడవటం పరిపాటైంది. ఆమె ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళవద్దని తండ్రి నచ్చచెప్పి పల్లెపాడు ఆశ్రమం నిర్వహణ బాధ్యత అప్పగించారు .సేవాగ్రములు పది నెలలు శిక్షణ పొందారు. డ్రామాలు నాటికలు పాటల ద్వారా కాంగ్రెస్ ప్రచారం చేశారు. ఆమె గొప్ప చిత్ర కారిణి.ఎన్నో బహుమతులు ఆలిండియా ఆర్ట్ ఎగ్జిబిషన్లో వచ్చాయి. ఇంగ్లాండులో కూడా ప్రదర్శింపబడ్డాయి.గాంధీజీ చనిపోయినప్పుడు మానసికంగా బాధపడి రెండు రోజులు ఆమె కోలుకోలేదు. కలలో గాంధీ కనపడి ఏడవ వద్దని చిత్రకళని బాగా అభివృద్ధి చేయమని చెప్పటంతో ఆమె కోలుకుంది .ఒక వారం కల్లా చిత్రాలు గీయటం ప్రారంభించింది .గాంధీజీని భారతమాత చేతుల్లో పట్టుకున్నట్టు ఆమె ఒడిలో గాంధీ తల ఒరిగిపోయినట్లు దేశమాత కళ్ళ నుంచి నీరు కారినట్టు చిత్రించింది .ఆమె పెయింటింగు సీతానగరం ఆశ్రమంలో బాపు కుటీరంలో ఉంది .ఒకప్పుడు బాపు కస్తూరిబా అక్కడికి వచ్చారు.ఓరుగంటి మహాలక్ష్మమ్మ తన ఎనిమిది మంది పిల్లలతో జాతీయ పోరాటంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో వెల్లూరు జైల్లో ఉన్నారు .కాంగ్రెస్ వాలంటీర్ గ్రూపులో ఈమె నెల్లూరులో విదేశీ వస్తు బహిష్కరణ గురించి పెద్దగా ఉపన్యాసాలుస్తూ జనాన్ని ప్రేరేపించారు. రంగనాయక స్వామి రథ ఉత్సవంలో భక్తులంతా కూడినప్పుడు పోలీసులు ఆమెను అరెస్టు చేసి గుడి నుంచి పోలీస్ స్టేషన్ దాకా మైలు దూరం పైగా నడిపించారు .ఎందుకంటే ఆ ఉత్సవ సమయంలో ఆమె పికెటింగ్ గురించి దేశ స్వాతంత్ర ఉద్యమం గురించి ఉపన్యాసం ఇవ్వటం కారణమైంది .పైగా నిర్భయంగా జాతీయ గీతాలు పాడుతూ పోలీస్ స్టేషన్ కి ఆమె వెళ్లటం సంచలనం సృష్టించింది. ఒక నెల మొత్తం ఆమెని ఒక జైలు నుంచి ఇంకో జైలుకి మార్చుతూ ఆత్మకూరు అక్కడి నుంచి కావలి మళ్లీ నెల్లూరు ఆపై వెయ్యి రూపాయల జరిమానా, వెల్లూరు జైలు శిక్ష ఆమెకు వి విధించారు. కానీ ఆమె భయపడలేదు. కాకపోతే పక్షవాతపు లక్షణాలు ఐదు సార్లు ఆమెను బాధించినా కూడా వారు జైల్లోనే ఉంచారు. హఠాత్తుగా వెంకటేశ్వర్ అనే ఆమె కొడుకు చనిపోవటంతో ఆమె కృంగి కృశించి 1945లో మరణించారు.మైత్రేయి నెల్లూరు నివాసి .ఈమె తల్లిదండ్రులు ఓరుగంటి మహాలక్ష్మమ్మ వెంకటసుబ్బయ్యగార్లు. ఈమె తల్లి లాగానే భక్తి దేశభక్తి గీతాలు పాడుతూ వాలంటీర్ గా విదేశీ వస్తు బహిష్కరణ గురించి ప్రచారం చేసింది .నూలు వడకటంలో ఆల్ ఇండియా స్వదేశీ ఎగ్జిబిషన్ నెల్లూరులో ఆమెకి బంగారు పతకం లభించింది.నెల్లూరికి చెందిన కూరపాటి మంగళాంబ తండ్రి వై.కృష్ణారావు.21మార్చి 1932లో వెల్లూరుజైలుశిక్ష అనుభవించిందామె🌹


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి