డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
డాక్టర్.ముత్తులక్ష్మీరెడ్డి ఎం.ఎల్.ఎ. చేసిన సేవలు నిరుపమానం.మహిళల విద్య ఆరోగ్యంతో పాటు దేవదాసీల బాధలు,వ్యభిచారిణులదీనగాథలకి చెక్ పెట్టిన మహిళామణి.పికెటింగ్ ఉప్పుసత్యాగ్రహాల్లో పాల్గొనకపోయినా,1930లో పదవికి రాజీనామాచేసి, ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ తరుఫున ఇంగ్లాండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి హాజరైంది.1933లో గాంధీజీ మద్రాస్ వచ్చినపుడు స్త్రీలతో మీటింగ్ ఏర్పాటుచేసి,అంటరానితనం నిర్మూలనకై ప్రతినచేయించింది. ఆమె అవ్వైహోం నెలకొల్పి అన్నికులాల మహిళలకు ఆశ్రయం కల్పించింది.కాన్సర్ ఆస్పత్రికై విరాళాలు సేకరించింది.కంటిచూపు తగ్గుతూ ఉన్నా పట్టుదల గా పనులు పూర్తిచేసిన ఆమె తొలి లేడీడాక్టర్ ఆనాటి మద్రాస్ లో! బ్రహ్మసమాజం తో కల్సి పనిచేసింది.ఆమె రెండో కొడుకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లాడు.1886లోపుట్టిన నారాయణస్వామి చంద్రమ్మాళ్ లకు జన్మించిన ఆమె 1968 లోకన్నుమూశారు.కొమర్రాజు అచ్చమాంబ 6అక్టోబర్ 1906లో గుంటూరు లో పుట్టారు.తండ్రి లక్ష్మణరావు లాయర్ కానీ దేశ సేవ లో పాల్గొన్నారు.డాక్టర్ కె.ఎల్.రావు ఆమె మేనమామ, బండారు అచ్చమాంబ మేనత్త ,బాంబే లో ప్లేగు రోగులకు సేవచేస్తూ ,ఆరోగంతో కన్నుమూశారు.అందుకే కొమ్మర్రాజు బిడ్డ కి ఆమేనత్తపేరు పెట్టారు.ఈమె మద్రాస్ లో చదివి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని విద్యార్థుల లీడర్ గా ముందుగా లాఠీ దెబ్బలు తిన్నారు.డాక్టర్ గా చిన్న డిస్పెన్సరీ తెరిచి సత్యాగ్రహులకి సేవ చేసింది.కాసా సుబ్బారావు,స్వతంత్ర న్యూస్ పేపర్ ఎడిటర్ కి వైద్యంచేసిందామె. యూత్ లీగ్ మెంబర్ .1935 లో ఇంగ్లాండ్ వెళ్లి మెటర్నిటీ ఛైల్డ్ కేర్ లో స్పెషలిస్ట్ ఐంది.ఎడింబర్గో, గ్లాస్గో యూనివర్శిటీల్లోLRCP L.I.M. గా 1936 భారత్ కి తిరిగొచ్చింది.1940లో కమ్యూనిస్టు లీడర్స్ నికల్సి1948దాకా ఆపార్టీలోపనిచేసిందామె. 1948లో అరెస్టయిన ఆమె1949లో విడుదలై పార్టీ రాజకీయరంగంనుంచి తప్పుకుని వైద్య వృత్తిని కొనసాగించింది. 1957లో కాంగ్రెస్ టికెట్ పై లోక్సభ కి ఎన్నికైంది. ఆలిండియా విలేజ్ మహిళాసంఘం సెక్రట్రీగా సేవచేసింది.దానికి ప్రెసిడెంట్ డా.రాజేంద్ర ప్రసాద్( తొలిరాష్ట్రపతి) సతీమణి రాజబంశీదేవి. విజయవాడ మెడికల్ సొసైటీ ప్రెసిడెంట్ గా,AIIMS ప్రతినిధిగా,ట్రాఫిక్ ట్రస్ట్ మెంబర్ గా ఆమె సేవలందించారు. విజయవాడలో మాంటిస్సోరీ స్కూల్ నెలకొల్పిన ఆమె మెటర్నిటీ ఛైల్డ్ వెల్ఫేర్ పై పుస్తకంరాశారు.రాజకీయ వేత్త, డాక్టర్ సోషల్ వర్కర్ రచయిత్రి గా రాణించిన ఆమె హార్ట్ ఎటాక్ తో 20.10.1964లో కన్నుమూశారు.పరకాల అహల్యాదేవి1926లో పుట్టారు.తండ్రి ఆచంట నరసింహం, భర్త పట్టాభిరామారావు.విజయవాడ వాసి.డా.అచ్చమాంబ రాజకీయ బడిలో చేరింది 1942లో.స్వీయ రక్షణ, ఫస్ట్ ఎయిడ్ARP లోమహిళలకు శిక్షణ ఇచ్చిందామె.కవిటం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె దేశ సంఘసేవ చేశారు.చాల చక్కని రచనలు చేశారు ,లైబ్రరీలకు సేవ లందించారు.1944లో బెంగాల్ కరువుకై విరాళాలు వసూలు చేశారు.యుద్ధ సమయంలో నిత్యావసర సరుకుల కై ఆందోళన చేసింది.యుద్ధ వ్యతిరేక నినాదాలతో వెస్ట్ గోదావరి అంతా పర్యటించారు.చిలువూరు అంగలూరు, కొత్త గూడెంలో మహిళాసంఘాల సభలకు హాజరైందామె.కొండపల్లి కోటీశ్వరమ్మ విజయవాడ నివాసి.కందుకూరివారి ప్రభావంతో సంఘసేవ చేస్తూ క్రమంగా కమ్యూనిస్టు గా మారింది.ప్రజాశక్తి,ఆంధ్ర మహిళ,వనితావాణి, ఆంధ్ర జ్యోతిలో ఆమె రచనలు వెలువడ్డాయి.ఆలిండియా మహిళాసంఘ కాన్ఫరెన్స్ ని నిషేధిస్తే 200మంది నారులతో కల్సి కలెక్టర్ కి మెమోరాండం సమర్పిస్తే, పోలీసులు బాష్పవాయుప్రయోగంచేసి ఆమెను అరెస్ట్ చేశారు.క్విట్ ఇండియా ఉద్యమంలో అండర్ గ్రౌండ్లో ఇతర మహిళల తో కల్సి పాల్గొంది.45వేలమంది మహిళలు రైతు కూలీ వర్గాలవారు తమహక్కులకోసం చేయిచేయి కల్పారు. గుంటూరులో 2వేల మంది స్త్రీలు బిడ్డల్ని ఎత్తుకొని జలియన్ వాలాబాగ్ డే ప్రదర్శనలో 1940లో పాల్గొన్నారు.1917లో జన్మించిన మాడుగుల కౌసల్యాదేవి తండ్రి ఎలవర్తి వెంకట సుబ్బయ్య. భర్త మాడుగుల వెంకట సుబ్బయ్య. మూల్పూరుకి చెందిన ఈమె, ఇంట్లోవారికి ఇష్టంలేకపోయినా,స్నేహితుల ప్రోద్బలంతో జాతీయోద్యమంలో పాల్గొని ఖద్దరు ధారణ, నూలువడకటం,ప్రభాతభేరీల్లో పాల్గొనడం తన 16వ ఏటనే ఆరంభించినది.9సెప్టెంబర్ 1942 లో వెల్లూరుజైలుశిక్ష 15నెలలు అనుభవించిన వీర ధీరమహిళ.ప్రొ.రంగా శిష్యురాలు🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి