4వ సర్గ : - ఎడ్ల లక్ష్మి- సిద్ధిపేట
రామా నీకు పట్టాభిషేకము నిర్వహించుట 
నా బాధ్యత నీవు నే చెప్పినట్లు వినుము
రాజులు, మంత్రులు, పురజనులంతా 
నిన్ను రాజుగా చూడాలని కోరుచున్నారు 



రామా" నిన్ను పట్టాభిషిక్తుని చేసెదను 
వినుము మరొక్క మాట నీ వీనులందు  
నాకు భయంకరమైన కలలు వస్తున్నాయి 
తోకచుక్కలు పట్టపగలే నేలన పడినట్టు 

ఇట్టి దురుస్వప్నాలు వస్తే కీడు జరుగును 
రాజ్యము ఏలే రాజులు మరణింతురు 
రామ నా సంకల్పము మారకముందే 
నీవు యువరాజుగా పట్టాభిషిక్తునివిగమ్ము

నేడు ఆ చంద్రుడు పునర్వస్ నక్షత్రమున 
రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రమున 
రేపు నీకు పట్టాభిషేకముకై దేవతలాజ్ఞ
సీతాదేవి నీవు ఉపవాస దీక్షను చేయుము 

రాత్రి  దర్భాస్తరణములపై నిద్రించవలెను 
సామాన్యంగా ఇట్టి శుభకార్యములకు 
పెక్కు విఘ్నములు యెదురు పడును 
నీ మిత్రులు నిన్ను కాపాడు చుందురు

కామెంట్‌లు