దశరథుడు రామునికి తెలిపి పంపును
శ్రీరాముడు తండ్రికి ప్రాణవమిల్లి సెలవొంది
తన తల్లి కౌసల్య వద్దకు త్వరగావెళ్ళును
తల్లి కౌసల్యదేవి తన పూజా మందిరమున
ఇష్ట దైవధ్యానమున నిమగ్నమై యున్నది
ఆ వేలలోనే రాముడు ఆమెను దర్శించి
తల్లి పాదపద్మములకు నమస్కరించెను
రాముని పట్టాభిషేకం గూర్చి విన్న సుమిత్ర
లక్ష్మణుడచటికి ముందే వచ్చియున్నారు
తల్లికి తనరాజ్యపాలన గూర్చి
తండ్రి చెప్పిన విషయములు తెలిపినాడు
రేపు జరుగు శుభకార్యముకై సీతకు నాకు
మంగళ కార్యక్రమములను తెలుపుము
చిన్నారి రామా! చిరకాలము వర్ధిల్లు
అందరాశీస్సులొంది ఆనందముగా యుండు
నీ శత్రువులు నశింతురు గాక
ధైర్యముతో రాజ్యలక్ష్మిని చేపట్టు
లక్ష్మణా ఈ రాజ్యలక్ష్మి నిన్నుకూడా చేరినట్లే
రాముడు ఇద్దరి తల్లులకు మ్రొక్కి వెళ్ళినాడ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి