మరుగున పడిన మగువలు51: - అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ

 డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
 
తుమ్మల తులశమ్మ 1912లో పుట్టారు.తండ్రి నాగళ్ల మౌలయ్య, భర్త  అప్పారావు కోవూరువాసి. జైలుశిక్షలు అనుభవించిన ఆమె హార్ట్ ఎటాక్ తో 1932లో పోయారు.పమిడిమర్రుకి చెందిన  గట్టువెంకమ్మ, గుంటూరుకు చెందిన  మంతెన వెంకమ్మ, సూర్య దేవర వెంకమ్మ (తెనాలి) గోళ్లమూడి వెంకాయమ్మ (భర్త పిచ్చయ్య) చేబ్రోలుకి చెందిన రావెళ్ల వెంకాయమ్మ, 1910లో పుట్టిన తట్ట వెంకట నర్సమ్మ  అమ్మ నాన్నలు తాయారమ్మ వెంకటశేషాచార్యులు. ఆమెభర్త వీరరాఘవాచార్యులు వేరే ఆమెని పెళ్లి చేసుకోవడంతో సోదరునితో మద్రాస్ లో ఉండి జైలుశిక్ష అనుభవించింది.ఇక ఆనాటికృష్ణాజిల్లాకి చెందిన వారినిగూర్చి తెలుసుకుందాం.1905లో ఎర్నేని  అమృతమ్మ, రామమ్మ  బొప్పన వెంకటాద్రి దంపతులకు జన్మించింది.భర్త సూర్య నారాయణ. అంగలూరు నివాసి.కొమరవోలులో గాంధీఆశ్రమంలో నూలువడకటం,ఖాదీ,హరిజనసేవ చేసి తన మంగళసూత్రాలు కూడా విరాళం ఇచ్చింది.ఆమెకుటుంబానికి చెందిన 16మంది స్త్రీలు,ఫ్రెండ్స్ అరెస్టయినారు.3సార్లు జైలుశిక్ష చాలాకాలం అందులో గడిపిన మహిళ అమృతమ్మ. కొర్రపాటి అంకమ్మ  భర్త శివరామకృష్ణయ్య  కప్తానివారిపాలెం నివాసి.గాంధీజీ  దివితాలూకాకి వచ్చినపుడు తన నగలన్నీ ఆయన కిచ్చేసిన త్యాగశీలి.సూరపనేని అన్నపూర్ణమ్మ, గరికపర్రువాసి నాగయ్య భార్య. వల్లభనేని అన్నపూర్ణమ్మ 1900లో గొడవర్రులోపుట్టారు. భర్త అంజయ్య. గుడివాడ కిచెందిన ఆండాళమ్మ, కోనేరు అనసూయ  తండ్రి త్రిపురనేని దుర్వాసులు. భర్త రాఘవయ్య. హిందీవిశారద విద్వాన్ పాసైనారామె. కోనేటి అనసూయ  తండ్రి వెంకట రామయ్య,తేలప్రోలు. మలిరెడ్డి అన్నపూర్ణమ్మ  తండ్రి లక్ష్మీరెడ్డి,భర్త రాఘవరెడ్డి.సూర్య దేవర అన్నపూర్ణమ్మ 15జూన్ 1908 లో వేములపల్లిలో పుట్టారు.తండ్రినాగయ్య,భర్త వెంకటప్పయ్య.ఉద్యమాల్లో పాల్గొన్న ఆమె ఆడపిల్లల బడులు రంగనాయకులపాలెం,వీరులపాడులో నడిపింది ఫ్రీగా.హిందీ ఖాదీ ప్రచారంచేసి,1943లో మహిళాసేవాదళ్ శిబిరం నడిపింది.తాలూకా మహిళామండలి,కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్,జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గా,చేబ్రోలులో లైబ్రరీ నడిపిన వనిత. దోనేపూడి బాలమ్మ  భర్త సీతారామయ్య (ఘంటసాల).అయ్యదేవర బాలాత్రిపురసుందరమ్మ 1904 లో పుట్టారు.నందిగామ కి చెందిన ఈమె1919లో కాంగ్రెస్ లో చేరిన ఆమె ఆనరరీ హోంసూపరింటెండెంట్,హిందూఉమెన్ విడోమ్యారేజ్ సొసైటీకిపనిచేసింది.కోనేరు భారతమ్మ  భర్త వీరరాఘవయ్య,తమిరిశ నివాసి.ఆమె జైల్లో పిల్లాడ్ని ప్రసవించి మదన్ మోహన్ మాలవ్య అని పేరు పెట్టింది.సుంకరదుర్గాంబ భర్త సూర్య నారాయణ  ముదునూరునివాసి. 10వ ఏటనే10రోజులు రిమాండ్ లో ఉన్న బాలదేశభక్తురాలు.1910లో చాగర్లమూడి హనుమాయమ్మ జననం.తండ్రి పాటిబండ్ల వెంకట్రామయ్య. బాలవితంతువైన ఆమెకి పెళ్లి సిహెచ్.వెంకట్రామయ్యతో జరిగింది.ఆమె కృష్ణాజిల్లా కాంగ్రెస్ బోర్డు వైస్ ప్రెసిడెంట్.కేశవరాజు కామాక్షమ్మ  తండ్రి వెంకటప్పయ్య  మచిలీపట్నం.చాగర్లమూడి కామేశ్వరమ్మ  భర్త  బ్రహ్మానందరావు.వెంట్రప్రగడనివాసి.దుగ్గిరాల కమలమ్మ 20నవంబర్ 1908 పుట్టారు.తండ్రి త్రిపురనేని జానకిరామయ్య. భర్త బలరామ కృష్ణయ్య అంగలూరునివాసి.ఘంటసాల కనకదుర్గాంబ భర్త డా.సీతారామశర్మ (బందరు)1900పుట్టిన ఈమెతండ్రి నండూరిగోపాలకృష్ణయ్య.లైబ్రరీలు  మహిళామండలులుఏర్పాటుచేశారు.త్రిపురనేని కౌసల్య 1900 పుట్టారు.తండ్రి ఆరికపూడి బ్రహ్మయ్య. భర్త అంజయ్య ( అంగలూరు)విచక్షణారహితంగా పోలీసుల లాఠీదెబ్బలుతిన్న స్పృహ కోల్పోయి జైలుశిక్ష అనుభవించిన ఆమె20రోజులుఅంగలూరులో హరిజన దేవాలయ ప్రవేశంకోసం నిరాహార దీక్ష పూనింది.1958లో అమరురాలైంది.పి.కౌసల్యాదేవి(కృష్ణాజిల్లా)పోలీసులు ఆమె మొహాన రంగునీళ్లు పోసి అవమానించారు.చెరుకూరికృష్ణవేణమ్మ భర్త శేషయ్య (తమిరిశ)గొర్రపాటి కుటుంబమమ్మ1905లోపుట్టారు.తండ్రి వీరమాచనేని భూషయ్య.భర్త  పండితవెంకటసుబ్బయ్య(ఘంటసాల)హిందీ సంస్కృతంలో మంచి పట్టున్న  ఆమె చాల పుస్తకాలు రాశారు.గుత్తికొండ లక్ష్మమ్మ  కృష్ణాజిల్లా 200ఫైన్ 1930లో జైలుశిక్ష అనుభవించింది.కోగంటి లక్ష్మమ్మ  పమిడిముక్కలవాసి కౌతమనేని సూరయ్యకూతురు.భర్త సుబ్బయ్య. బొప్పన లక్ష్మికాంతమ్మ  గరికపర్రునివాసి.గొర్రెపాటి లక్ష్మికాంతమ్మ 1907లో పుట్టింది.తండ్రి వేమూరివీరన్న ,భర్త నర్సింహం ఘంటసాల నివాసి.కొల్లిపర లక్ష్మికాంతమ్మ  గన్నవరంలోని కపిలేశ్వరపురంకి చెందిన  వీరయ్య భార్య. ఈమె కాకినాడ  కాంగ్రెస్ వాలంటీర్ గా చేతులకున్న బంగారుగాజుల్ని గాంధీజీ కి ఇచ్చేశారు. 1933_1935 జిల్లా కాంగ్రెస్ మెంబర్,గ్రామ మహిళాసంఘం సెక్రటరీగా సేవ లందించింది.వెనిగండ్ల లక్ష్మికాంతమ్మ 1899లో పుట్టిన కొమ్మమూరువాసి.1941లో చనిపోయారు🌷
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం