డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
విమలాబాయి మేల్కొటే Vimalabai Melkote 1910లో ఔరంగాబాద్ లో జన్మించారు.కన్నడ మాతృభాష. భర్త డా.జి.ఎస్.మేల్కొటే. అత్తింటి వాతావరణం,భర్త ప్రోత్సాహంతో పికెటింగ్, ఖాదీ ప్రచారం,హరిజనసేవ చేశారామె.ఆమె ఇల్లు రాజకీయాలకు,కాంగ్రెస్ ఆఫీస్ కి కేంద్రం.కర్ణాటక మహిళా మండలిలో చురుకైన పాత్ర పోషించారు.తన 16ఏళ్ల వితంతు సోదరి కమలారావు, ఆడపడుచు వనమాలితో విక్టరీ ప్లేగ్రౌండ్స్ లో గాంధీజీ పుట్టిన రోజు వేడుకలు జరిపిందామె. అంతా అరెస్టయి కృష్ణ ప్రసాద్ దేవిడీలో 15రోజులున్నారు.నీరు గాలిలేని ఇరుకు సెల్ లో ఇంటివంటమనిషి భోజనం తినేవారు. ఆమె ఇంటిని పోలీసులు సోదా చేస్తుంటే రహస్య పత్రాలను ఆమె సోఫాల్లో, గోధుమ బస్తాల్లో దాచేది. 5సెప్టెంబర్ 1947లో సెంట్రల్ జైల్లో కమ్యూనిస్టు మహిళలతో ఉంది.30నవంబర్ 1947లో విడుదలైంది.ఆమె 14ఏళ్ల కొడుకు రహస్య పత్రాలతో ఉంటే లాఠీచార్జిచేశారుపోలీసులు ఆచిన్నారిపై! ఆమె సోదరుడు రాజగోపాల్ అండర్ గ్రౌండ్ వర్కర్ గా చురుగ్గా ఉండేవాడు.అతన్ని చాకచక్యంగా పోలీసుల బారినుంచి తప్పించేది. అచ్యుత్ పట్వర్ధన్, అరుణ అసఫాలీ జైలునించి తప్పించుకుని 3నెలలు ఆమె ఇంట్లో ఉన్నారు.ఓసారి విమల కదిలే రైలు ఇంజన్ డ్రైవర్ని బతిమాలి మిలటరీ బోగీలోకి ఎక్కి ఆపై ఫస్ట్ క్లాస్ లోకి చేరింది.భర్త అండర్ గ్రౌండ్ లో ఉంటే పిల్లల తో ఒంటరి రాజకీయ పోరాటం చేసింది.హైదరాబాద్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ ఎడ్వైజరీబోర్డ్ ఛైర్మన్ గా,ఫామిలీ ప్లానింగ్ ప్రెసిడెంట్ గా,ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మెంబర్ గా,వైస్ ప్రెసిడెంట్ అఖిల కర్ణాటక పరిషత్ రిసెప్షన్ కమిటీలో చురుకైన పాత్ర పోషించారు.తామ్రపత్రగ్రహీత.నందగిరి ఇందిరాదేవి తండ్రి వడ్లకొండ నర్సింహ్మారావు. భర్త వెంకట్రావు,రచయిత. ఆమె తెలుగుబడిలో(మాడపాటి )చదివి, స్కూల్ ఫైనల్ పరీక్షలు కార్వే యూనివర్శిటీలో FYA, SYA,GA(ఫస్ట్ ఇయర్,సెకండ్ ఇయర్, గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్(గృహితగమ) చదివారు.విద్యార్ధినిగా ఉపన్యాసాలతో అదరగొట్టేవారు. బాల్యవివాహాలు ,స్త్రీలవిద్య సమస్యల్ని విపులంగా చర్చించేవారు.1937లో నిజామాబాద్ ఆంధ్ర మహిళాసభ కి అధ్యక్షత వహించారు.రజాకార్ల ఆగడాలప్పుడు భర్త అండర్ గ్రౌండ్ లో ఉండి అరెస్టయిన ప్పుడు ఆమెపడిన అష్టకష్టాలు అన్నీ ఇన్నీ కావు.ఆమె విజయవాడ వెళ్లిపోయి పోలీస్ యాక్షన్ తర్వాత తిరిగొచ్చారు.ఆమె హాస్య కథలు రాస్తే భర్త విషాద కథలు రాయటం ఓ విశేషం.బూర్గుల అనంత లక్ష్మీదేవిభర్త ప్రముఖ రాజకీయ వేత్త రామకృష్ణారావుగారు. ఈమె రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా ఆంధ్ర మహిళాసభ మీటింగ్స్ కి హాజరవటం,షాద్ నగర్ సభకి అధ్యక్షత వహించటం జరిగింది.ఆంధ్ర యువతీమండలికి పునాది వేసిన వారిలో ఈమె ఒకరు.15ఏళ్ల
అనుబంధంతో భూమి విరాళాలకోసం శ్రమించారు.నేడు సంస్థ బిల్డింగ్స్ తో విద్యాసంస్థ గా విరబూసింది. భర్త సోదరులు రాజకీయాల్లో పాల్గొన్నప్పుడు ప్రోత్సాహించిన మగువ. సోదరులు మందుముల నర్సింగరావు,రామచంద్రరావు.రాజకీయంగా కాక సోషల్ వర్కర్ గా ఆమె ఆదర్శ వనిత ప్రమీలా మహేంద్ర ను అంతా ప్రమీల తాయి అని పిల్చేవారు.బన్సీలాల్ బాలికాపాఠశాల హెచ్.ఎం. ఆర్యసమాజ్ అభిమాని.సైకిల్ తొక్కుతూ మహిళలకు ప్రేరణ ఇచ్చారామె. కమ్యూనిస్టు పార్టీవైపు ఆకర్షితురాలైన ఆమెసంఘంలో కుళ్లును స్త్రీల దీనహీనస్థితిని పోగొట్టాలని కంకణం కట్టుకుని పార్టీ, భాషతోసంబంధంలేకుండా నిజాంకి వ్యతిరేక ఉద్యమంలో బాసటగా నిలిచింది.రాత్రిస్కూల్ నడిపి,బీదలకు రేషన్ సరిగ్గా అందేలా చూసింది.పోలీస్ యాక్షన్ దాకా అండర్ గ్రౌండ్ లో పని చేసిందామె.1951లో అరెస్టయి1952లో ఎలక్షన్స్ ముందు విడుదలైంది.ఆమె మహారాష్ట్రియన్, జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి తోటి కమ్యూనిస్టు మహేంద్ర ను పెళ్లాడింది.ఓ అనాధాశ్రమంలో పెరిగిందామె. బడిలో ఆంగ్లవిద్య లేదు.మెట్రిక్ చదివి హెచ్.ఎం.గా క్రమంగా ఎకడమిక్ క్వాలిఫికేషన్స్ తో ఎదిగింది.ఖద్దరు ధారణ,వాగ్ధాటితో చొచ్చుకుపోయే స్వభావం ఆమెది.కాఫీ,టీ అస్సలు ముట్టేదికాదు. 1967లో బెర్లిన్ లో జరిగిన వరల్డ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ కిభారత ప్రతినిధిగా హాజరైంది.స్త్రీల కోసం కోఆపరేటివ్ సొసైటీలు నెల కొల్పింది. వయోజనవిద్య కుట్టు తో ఉపాధి అవకాశాలు కల్పించింది.1997లో ఆమె మరణించారు🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి