5వ సర్గ :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


గుంపుగా చేరిన జనులెల్లరును
సముద్రతరంగములవలె విరజల్లులతూ
వారి సంతోష సంభాషణలతో 
రాజమార్గము సాగరధ్వని వలే యున్నది

రాజవీధులన్నీ చక్కగా శుభ్రపరిచి 
అరటిచెట్లతో అందంగా అలంకరించగా 
అన్ని గృహములపై ధ్వజపతాకాలు
రేపరేపలాడుతూ కనువిందు గావించును

అయోధ్య పురమున నివసించు వారు 
స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు 
అందరూ ఆనందంములో తేలిపోతున్నారు 
మహర్షి " ఆ దృశ్యం చూసి సంతోషించి

దశరథుని మందిరమును చేరినాడు 
మహర్షిని చూసి దశరథ మహారాజు 
భక్తితో అతనికి నమస్కరించినాడు
మహర్షి ఆ మహారాజును ఆశీర్వదించాడు 

దశరథుని మందిరము రాత్రి తారల రీతిగా 
మిల మిల మెరుపుల మధ్యన చంద్రునిలా 
దశరథమహారాజు ప్రకాశిస్తున్నాడు 
మహర్షి అ దృశ్యం చూసి సంతోషించాడు

కామెంట్‌లు