6 వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
శ్రీరాముని పట్టాభిషేక వార్తను విని ప్రజలు సంబరముతో పొంగిపోవుట 
--------------------------



సీతారాములు భక్తితో ఉపవాస దీక్షతో 
వారు శ్రీమన్నారాయణని తలచుకొని 
జ్వలించు అగ్నియందు శాస్త్రయుక్తముగా 
హోమం చేయగా నిశ్చయించుకున్నారు 

శ్రీరాముడు వేకువజామున మేల్కొని 
గృహమును చక్కగా అలంకరించి 
వంశావళి కీర్తనలను ఆలకించి 
గాయత్రి మంత్రమును జపించగా 

సీతాదేవి రామునితో పాటు ఆచరించెను 
జనులు పట్టాభిషేకం గూర్చి తెలుసుకొని 
తన గృహాలను వీధులన్నీయు 
పూలమాలతో అలంకరించారు 

ప్రజలు రామును గూర్చి ముచ్చట్లు
రాముడు ధర్మబుద్ధి గలవాడు 
అందరిని ప్రేమతో ఆదరించువాడు 
అతడు కలకాలము వర్ధిల్లాలంటారు

ప్రజల గుండెలలో దేవుడు రాముడు 
అయోధ్యపురము రాముని పాలనలో 
సస్యశ్యామలముగా ఉంటుందని 
పురవాసులందరూ సంతోషంగున్నారు

కామెంట్‌లు