ఓ కాలిందిని నీవు వీటి చెందకు
నీవు తిన్న విషముతో కడుపులో బిడ్డకు
ఎలాంటి ప్రమాదము జరగదు
బలమైన పుత్రుని కంటావు నీవు
సవ్యమహార్షిని సేవిస్తూ కాలిందిని
ఆయన అనుగ్రహమునకు పాత్రురాలైయింది
ఒక శుభ ఘడియన పుత్రుని కన్నది
విషప్రయోగాన పుట్టినఅతని పేరు సగరుడు
సగరుని కుమారుడు హసమంజుడు
అతని పుత్రుడు అంశుమంతుడు
అతని పుత్రుడు దిలీపుడు
అతని పుత్రుడు భగీరథుడు
భగీరథుని తనయుడు కకుత్ స్థుడు
అతని పుత్రుడు రఘుమహారాజు
అతని పుత్రుడు ప్రబుద్ధుడు
అతడు వశిష్టుని శాపం వలన నరబక్షకుడయ్యాడు
దానికి ప్రతీకారంగా వశిష్టుని శపించుటకు
జలములను చేత బోనాల అతని భార్య
వలదనగా అతని పాదాలపై చల్లుకున్నాడు
అతనికి కల్మషపాదుడని పేరు వచ్చినది
అతని కుమారుడు శంఖనుడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి