శంఖనుని పుత్రుడు సుదర్శనుడు
ఆయన సుతుడు అగ్నివర్ణుడు
అతని పుత్రుడు శీఘ్రగుడు
అతనిపుత్రుడు సూనుడు
సునుడి పుత్రుడు మరవు,
మరువు పుత్రుడు ఆత్మజుడు
ఆత్మజుని పుత్రుడు ప్రశుశ్రుకుడు
ఆయన పుత్రుడు అంబరీషుడు
అంబరీష్యుని తనయుడు నహూషమహారాజు
నహూషిని పుత్రుడు యయాతి
యయాతి పుత్రుడు నాభాగుడు
అతని పుత్రుడు అజుడు
అజమహరాజు పుత్రుడు దశరథుడు
దశరథుని పుత్రులు రామలక్ష్మణులు
ఇక్ష్వాక వంశము అతి పవిత్రమైనది
ఈ వంశమున జన్మించిన పుణ్యాత్ములు
పరమధార్మికులు సత్యవంతులు
ఆ వంశములోపుట్టిన రామలక్ష్మణులకు
మీ కుమార్తెలైన సీతా, ఊర్మిళలను ఇచ్చి
వివాహము చేయుము జనకమహారాజా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి