ఓ భార్గవ రామ ఈ బాణము ఎక్కుపెట్టి
నీ పుణ్యఫలాలనుతొలగింపు మంటావా
నీ పుణ్యరాశులను నశింపచేయమంటావా
నీవు కోరిన రీతిగా నే జేసేదా
ఈ వైష్ణవబాణము చాలా దివ్యమైనది
శత్రుపురములను రూపుమాపునది
బలగర్వములను అణచివేయునది
ఈ బాణ ప్రయోగము వ్యర్థము కారాదు
వైష్ణవధనుర్భాణములను ధరించియున్న
శ్రీరాముని దర్శించుటకు బ్రహ్మదేవతలు
ఋషీశ్వరులు గుంపులుగా వచ్చారు
గంధర్వులు ,సిద్ధులు, నాగులు వచ్చారు
శ్రీరాముడు ఆ బాణము నెక్కు పెట్టగానే
లోకమంతయు శబ్దమాయెను
భార్గవరాముడు వైష్ణవతేజం కోల్పోయెను
అతడు ఆశ్చర్యంతో రాముని జూచెను
తమ తేజస్సు పరాక్రమము సన్నగిల్లిపోగా
శ్రీరాముని తో ఇలా అంటాడు
పూర్వము జయించిన భూమండలమును
కాశ్యపుమహర్షికి సమర్పించితిని

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి