🍁 77వ సర్గ 🍁 దశరథుడు నవవధువరులతో అయోధ్యకు చేరుట : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
పరశురాముడు వెళ్లిన తరవాత 
దశరథరాముడు ప్రసన్న చిత్తుడై 
ప్రతిభాశాలియైన వరుణదేవునకు 
ఆ ధనుర్భాణములను అప్పగించినాడు 

గురువులకు తండ్రికి రాముడు నమస్కరించి 
మనము అయోధ్యకు పయనమవుదాము
దశరథుడు శ్రీరాముని మాటలు విని 
ప్రియశృతిని ప్రేమతో కౌగలించుకుంటాడు

దశరథుని ఆజ్ఞతో అయోధ్యకు కదలినారు 
అయోధ్య అంతయు పచ్చని తోరణాలతో 
అందముగా అలంకరించి యున్నది 
పురవీదులు చూసి వారెంతో మురిసినారు

బ్రాహ్మణులు మహార్షులు పురజనులు 
నవ దంపతులకు స్వాగతం పలుకుతూ 
మేళ తాళాలతో ఎదురు వెళ్ళినారు 
కౌసల్య ,సుమిత్ర, కైకేయి ఎదురెళ్లినారు 

నలుగురు దంపతులు అంతఃపురమున 
సంతోషముతో అడుగిడి
ఆ నవవధువులు పట్టు వస్త్రములందుకొని
పూజా గృహమున పూజలు జేసినారు 


కామెంట్‌లు