కోపముతో పటపట పళ్ళు కొరుకుతూ
కైకేయి గృహమును చేరి గూనిమంథర
కైకేయితో ఇలా అంటుంది
ఓ కైకేయి! నీకు బాధలు రాబోతున్నాయి
భరతునికి కష్టము రాబోతుంది
నీ భర్త నీకు పెద్దమోసం చేస్తున్నాడు
భరతునికి అన్యాయము చేస్తున్నాడు
నీవు భరతుడు, రామునికి చాకిరి చేయాలి
"ఓ కైకేయి! రేపు శ్రీరామునకు నీ భర్త
పట్టాభిషేకం చేయబోతున్నాడు
ఆమె మాటలిని కైకేయి సంతోషించింది
రాముడు భరతుడు నాకు సమానులే
రాముని గూర్చి శుభవార్త తెలిపినందుకు
నీకు నాహారము కానుకగా ఇస్తున్నాను
ఇంతకంటే ఇంక నీకు ఏమి కావలెను
రాముని పట్టాభిషేకం గూర్చి విని కైకేయి
ఎంతో సంతోషంతో పొంగిపోతూ
నాకు నీవు శుభవార్త తెలిపినందుకు
నీవేదడిగిన నీకు నేనిస్తాను మంథర

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి