బిహారి మోసం: - జక్కుల అనన్య-8వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల-జిల్లా: సిద్ధిపేట-చరవాణి:9704865816.
 గుండారం అడివిలో జంగపిల్లి ఉండేది.దాని పేరు బిహారి. రోజు ఆహారం కోసం ఎలుకలను చిన్న చిన్న పక్షులను,కుందేళ్లను పట్టుకొని తినేది.తెలివి బాగుండి కూడా శ్రమపడి ఆహారాన్ని సంపాందించుకోవడం ఇష్టం లేదు.ఒక ఉపాయం ఆలోచిస్తుంది.ధ్యానం చేయాలని ఆలోచిస్తుంది.రోజు పండ్లు,ఆకులు,కూరగాయలు అల్పాహారంగా తింటున్నట్లు నటించేది.రోజుల తరబడి బిహారి ధ్యానంలో ఉండేసరికి మిగతా జంతువులకు ఆశ్చర్యమనిపించింది.దాని చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాయి. ఒకరోజు రాత్రి బిహారికి బాగా ఆకలేస్తుంది.శాకాహారం తింటున్నట్లు
నటిస్తే బిహారి కడుపు నిండడం లేదు. ఒక ఉపాయం వచ్చింది.రోజు రాత్రి చాటుమాటుగా ఎలుకలను, పక్షులను,మిగతా జంతువులను పట్టుకొని తినాలనుకుంటుంది.అప్పటినుండిరోజు రోజుకు అడవిలో జంతువులు,ఎలుకలు తక్కువ అవుతున్నవి.ఒక రోజు దండోరా వేసి జంతువులన్ని సమావేశం పెట్టుకున్నాయి.దానిలో కొన్ని జంతువులు ఇలా 
అంటున్నవి.
ఎలుకలు,పక్షులు జంతువులు రోజు రోజుకు మాయమైపోతున్నాయి.ఎలా? ఎందుకు? అని ఆలోచనలో పడతాయి.అప్పుడు అడవిలో ఉన్న "ముసలి కుందేలు" ఇలా అంటుంది. మాయ మవ్వడానికి కారణం నేను తెలుసుకుంటాను అంటుంది.ఆ రోజు రాత్రి ముసలి కుందేలు చాటుగా బీహారి ని గమనిస్తుంది.అది ఎలుకలను పట్టి తినడం చూస్తుంది.మిగతా జంతువులన్నిటిని తీసుకొచ్చి బిహారీ వ్యవహారాన్ని తెలియజేస్తుంది.సమావేశం ఏర్పాటు చేసుకొని ముసలి కుందేలు ఇలా చెబుతుంది. దీనికంతటికి కారణం బిహారే అని చెబుతుంది.
జంతువులన్నీ ఒక ఉపాయం ఆలోచిస్తాయి.ఈరోజు రాత్రిమనం ఒక వల తీసుకొని వచ్చి వలకు దూరంగా ఒక ఎలుకను ఉంచుదాం.బిహారి పట్టుకోవడానికి వస్తుంది.
మనం దూరంగా ఉండి గమనిస్తాం అనుకుంటాయి.రాత్రి కాగానే బిహారీ ఎలుకను చూసి ఈరోజు ఆహారం దొరికిందని సంతోషపడుతుంది.ఎలుకను పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తుంది.అంతలో వలలో చిక్కుకుంటుంది.మిగతా జంతువులన్ని బిహారి దగ్గరికి వెళ్తాయి.రోజు రాత్రి నీవు చేస్తున్న పని ఇదా!
ఈ రోజునీకు తగిన గుణపాఠం చెప్పాలనుకుంటాయి.అన్ని కలిసి బిహారికి దేహశుద్ధి చేసి వేరే అడవికి తీసుకెళ్లి విడిచిపెట్టి వస్తాయి.ఒకవేళ నీవు మా అడవికి వస్తే చంపేస్తామని బెదిరిస్తాయి.ఆ రోజు నుంచి పక్షులు, ఎలుకలు, జంతువులన్నీ క్షేమంగా ఉంటాయి.


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Bagundi