శ్రీరాముడు సకల శాస్త్రములను
ధనుర్విద్యలను నేర్చుయున్నవాడు
కావున అతనితో నీ కుమారునికి
ఎప్పటికైనా ప్రమాదము యుండును
శ్రీరాముడు యువరాజు అగుటతో
రాజ్యాధికారము కౌసల్య చేతిన యుండును
అప్పుడు నీవామెకు దాసిగా యుంటావు
రామునికి నీ పుత్రుడు సేవ చేయవలెను
మంథర మాటలిని కైకేయి అవేమి మాటలని
శ్రీరాముడు నాకు దైవసమానుడు
ఆయన పాలనలో సోదరులను
కన్న తండ్రి వోలె కరుణతో చూస్తాడు
ఈ కోసల దేశమును జేష్ట పుత్రుడు
శ్రీరాముడు వందలేళ్ళు ఏలిన తర్వాత
పురుష శ్రేష్టుడైన భరతుడు రాజగును
శ్రీరాముని పట్టాభిషేకం తో శుభమగును
శ్రీరామ భరతులు నాకు రెండు కళ్ళు
రాముడు నన్ను ఆప్యాయతగా చూస్తాడు
ఆ నలుగురు అన్నదమ్ముల సోదర ప్రేమ
అమూల్యమైనది వారందరూ నా పుత్రులే

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి