ధైర్యమే ఆయుధం: - జక్కుల కార్తీక్ -9వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -జిల్లా: సిద్ధిపేట -చరవాణి:9704865816.

 తోర్నాల గ్రామంలో ప్రజలు వ్యవసాయం చేస్తూ,పంటలుపండిస్తు జీవనం సాగిస్తుండేవారు. పిల్లాపాపలతో హాయిగా ఉండేవారు.నిజాంరాజు పరిపాలనలో రజాకార్ల పాలన ప్రారంభం ఐంది.ప్రజలకు అన్ని కష్టాలే మొదలయ్యాయి.పండించిన పంటలన్ని ఎత్తుకెళ్ళేవారు.ఎదురు మాట్లాడితే లాఠీలతో దాడిచేసేవారు.
ఈ ఏడాది మంచి పంటలు వచ్చాయని ప్రజలంతా ఆనందంలో మునిగితేలుచున్నారు. అప్పుడే రజాకార్లు వచ్చి బెదిరించి,కొట్టి పంటను లాక్కెళ్ళిపోతున్నారు.గ్రామంలో నవీన్ తెలివైన యువకుడు. రజాకార్లకు ఎదురుతిరిగాడు.ఎవర్రా మీరు? మేం పండించిన పంట ను ఎత్తుకెళ్లి పోతున్నారు. మీకెందుకు ఇస్తాం.ఇవి మా భూములు.మేం పండించిన పంటను ఇవ్వమని ఎదురు తిరుగుతాడు.అప్పుడు రజాకార్లు ఒరేయ్! కుర్రోడ మాకే ఎదురు వచ్చే మొనగానివా! అంటూ నవీన్ ను చితకబాదారు.పంట నంత తీసుకెళ్ళారు.నవీన్ చేసేది లేక ఊరుకున్నాడు.
గ్రామంలో  80 సంవత్సరాల కొమురయ్య నవీన్ ధైర్యాన్ని మెచ్చుకున్నాడు.రజాకార్ల  విషయాలన్నీ నవీన్ కు చెబుతాడు.నవీన్ కు ధైర్యం నూరిపోస్తాడు.అప్పుడు నవీన్ గ్రామస్తులందరిని ఐక్యతపరిచాడు.సమస్యకు పరిష్కారం చేయాలనుకున్నాడు. అప్పుడు గ్రామస్తులందరి కొన్ని రోజులు కర్రసాములో శిక్షణ ఇప్పించారు.అందరు ప్రాణాలకు తెగించారు. ఐక్యంగా ఉంటామని నవీన్ కు మాటఇచ్చారు.
మనము మన చుట్టు ప్రక్కల గ్రామాలవారిని ఐక్యపరిచాడు.
ఇప్పుడు వారి ఆటలు కట్టించాలని అనుకున్నారు.  అప్పుడు అందరు కూడా కర్రలు పట్టుకొని,కారప్పొడి చేతుల పట్టుకొని సిద్ధంగా ఉంటారు.ఈసారి మళ్లీ పంట పండే సమయానికి ఊరు మీద పడి ప్రజలను బెదిరిస్తారు.
నవీన్ ఇలా అంటాడు. ఇది మా కష్టార్జితం.మా ప్రాణాలు పోయినా సరే! మా పంట మేము కాపాడుకుంటామని గట్టిగా హెచ్చరిస్తాడు.
రజాకార్లు నవీన్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తారు.గ్రామస్తులందరు ఒక్కసారిగా కర్రలతో,కారం ముద్దలతో దాడిచేశారు. రజాకర్లు పంటనంత అక్కడే వదిలేశారు.పారిపోసాగారు. అప్పుడు నవీన్ మరెప్పుడైనా మా ఊర్ల మీద పడి పంటలు తీసుకెళ్తే ఇదే గతి పడుతుందని వారికి వినబడేలా హెచ్చరిస్తాడు. గ్రామస్తులందరూ నవీన్ యొక్క ధైర్య సాహసాలకు మెచ్చుకుంటారు. అప్పటినుండి గ్రామస్తులందరూ సంతోషంగా ఎవరి పంటలు వారు పండించుకొని హాయిగా జీవనం కొనసాగిస్తారు.
ప్రతి ఒక్కరు నవీన్ లాగా ధైర్యంగా ఉండాలని కొమురయ్య హితబోధ చేస్తాడు.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం