ఇంటి దేవతలు: - మాండవరాజు అఖిల-9వ, తరగతి -ZPHS: బక్రిచెప్యాల.-చరవాణి 9704865816.
 ​

అదొక చిన్న పల్లెటూరు.ఆ ఊరిలో రామయ్య,సీతమ్మ భార్యాభర్తలు ఉండేవారు. వారికి ఇద్దరు పిల్లలు అక్క జేసిక,తమ్ముడు చింకు. రామయ్య,సీతమ్మలు కూలి పనులకు వెళ్లి పిల్లలను చదివించేవారు.
​పిల్లలు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించారు.
జేసిక ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ వచ్చేది.చింకు సెకండ్ వచ్చేవాడు.
​ఆ సంవత్సరం దీపావళి పండగ వచ్చింది.సీతమ్మ ఎంతో కష్టపడి దాచిన డబ్బులతో పిల్లలిద్దరికీ కొత్త బట్టలు కొనిచ్చింది. నాన్న రామయ్య మాత్రం చేతిలో ఒక చిన్న మట్టి కుండ, అందులో ఒక చిన్న మల్లె మొక్క పట్టుకుని వచ్చాడు.
​రామయ్య పిల్లలను పిలిచి, "పిల్లలూ!ఈ మల్లె మొక్కను మీకు కానుకగా ఇస్తున్నాను. దీనిని జాగ్రత్తగా పెంచండి"అంటాడు. రోజు నీళ్లు పోసిపెంచండి.మీకు ఇంకేమైన కోరికలు ఉన్నాయా అని నాన్న అడుగుతారు.మాకేం కోరికలు లేవు. మీ ఆశీస్సులు ఉంటే చాలు.మీరు మా ఇంటి దేవతలు అని నాన్నను కౌగిలించుకున్నారు.
​ ఒకరోజు అమ్మానాన్న ఇద్దరూ పక్కూరికి పని కోసం వెళ్తారు. ప్రమాదానికి గురయ్యారు. ఆ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.
​జేసిక,చింకుఅనాథలైనారు. బంధువులందరూ వచ్చారు. పిల్లలను ఓదార్చారు.చింకు ఏడవడం మొదలుపెట్టాడు.కానీ జేసిక ధైర్యం కోల్పోలేదు. తమ్ముడి కన్నీళ్లు తుడిచి, చింకూ, అమ్మానాన్న మనతోనే ఉన్నారు. మనం అస్సలు ఏడవకూడదుఅని ధైర్యం చెప్పింది.
​తల్లిదండ్రులు లేకపోయినా జేసిక కష్టపడటం మొదలుపెట్టింది. ఉదయం బడికి వెళ్తూ, సాయంత్రం చిన్న చిన్న పనులు చేస్తూ తమ్ముడిని చదివించసాగింది.
​ఒకరోజు వర్షం పడింది.నాన్న ఇచ్చిన మల్లె మొక్క బాగా పెద్దదైంది. ఆ వర్షానికి మొక్క మొదట్లో ఉన్న మట్టి కొట్టుకుపోయింది. అప్పుడు చింకుకు అక్కడ ఏదో మెరుస్తూ కనిపించింది. అక్కడికి వెళ్లి చూడగా, ఒక పాత ఇనుప పెట్టె దొరికింది!
​ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో కొంత డబ్బు, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో రామయ్య చేతిరాతతో ఇలా ఉంది:
​"నా బంగారు బిడ్డలారా! ఈ డబ్బు నేను మీ చదువుల కోసం దాచింది. కష్టం విలువ తెలిసిన రోజే దీనిని మీరు సాధిస్తారని ఇక్కడ దాచాను. చదువును ఎప్పుడూ ఆపకండి."
​అమ్మానాన్న తమ కోసం ఎంత ఆలోచించారో తెలిసి ఇద్దరూ ఏడ్చేశారు. ఆ డబ్బుతో జేసిక తమ్ముడిని, బాగా చదివించుకుంది. తాను బాగా చదివింది.
​జేసిక ఒక పెద్ద కలెక్టర్ అయ్యింది, చింకు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగంవచ్చింది.ఇద్దరూ జీవితంలో స్థిరపడ్డారు.
​కానీ వాళ్ళు తమ గతాన్ని పడ్డ కష్టాన్ని మర్చిపోలేదు. తాము సంపాదించిన డబ్బుతో ఒక పెద్ద ఆశ్రమాన్ని నిర్మించారు. దానికి ఇంటి దేవతలు అని పేరు పెట్టారు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం