అవతారాల ఆది ! దైవ విశ్వాస పునాది!: - డాపివిఎల్ సుబ్బారావు. విజయనగరం. 9441058797.


 1.
విష్ణుమయం జగత్ సర్వం! 
ప్రతియుగం అవతారం సంభవం!
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆశయం! 
రూపమేదైనా ఆయనే సత్యం! 
హరితప్ప అన్యులెవరు,  
      అన్నమయ్యే సాక్ష్యం!
2.
ప్రథమావతారం జలచరం మీనం! 
ఇంతింతై అదెంతో పెరిగిన వైనం!
దుష్టుని పాలపడ్డ వేద సంగ్రహం! 
శిక్షించి రక్షించిన ఆ మహా మీనం! 
మీనం సాక్షాత్ విష్ణు స్వరూపం! 
3.
జీవం మొదట నీటిలో పుట్టింది!
జీవశాస్త్ర విషయం పుష్టే మీనం!
నీటిలో ఉన్న ఆక్సిజన్ ప్రాణం! 
మొప్ఫలశ్వాస, తోకతో చలనం!
మత్స్యానికి ఇతిహాస ప్రాధాన్యం! 
4.
అర్జునుడు మత్స్యయంత్ర, ఛేదనం ద్రౌపతితో వివాహం!
దుష్యంతుడు శకుంతల కిచ్చిన, ఉంగరం మీనగర్భాన పదిలం!
మత్స్యగంధితో పరాశర, సంగమం వ్యాసోద్భవం!
అమ్మవారు మధుర మీనాక్షి,
 లోకాన సాక్షి భూతం! 
కవులు నాయకి నయనాలు, చేపల్లా చంచలమనడం నిత్యం!
5.
చేపల వృద్ధి నీలి విప్లవం, ఆధునిక కాలాన ఆవిష్కరణం! 
మత్స్యకారుల జీవన సంక్షేమం, నేడు ప్రభుత్వ ఉద్దేశం! 
చేపల వేట ఆధునిక బోట్ల,
అధిక వేగవంతం, ప్రోత్సాహం!
జాలరి నృత్య ప్రదర్శనం, సర్వదా జన మనోరంజనం! 
చేప ఆహారం, బుద్ధి వికాసం, 
బెంగాలీయులే ఉదాహరణం!
________
కామెంట్‌లు