జ్ఞాపకమా!
నిదుర తెరలుదాటి రాకు
ఊపిరే బరువుగా మిగిలె నాకు
ఏలనో ఈమౌనసమరంలో
గుండెలో రగిలేటి గాయాలు...
చుక్కలెన్నివెలుగులుచిమ్మినా
నల్లని నిశిని వీడిపోలేవు
అడుగులెన్నిదూరాలు సాగినా
రాతను మార్చి పయనించలేవు
ఎదలో విరహపు వీణానాదం
బతుకులో అందని గమ్యస్థానం
ఆఖరివరకు వీడని భ్రమఇది
కాలమే ఆర్పని జ్వాలఇది
మరపురాని ఈమౌనరోదనలో
కన్నీరే తోడై నిలిచే నాకు
జ్ఞాపకమా!ఇకనైనా సెలవు తీసుకో
రగిలే గాయానికి శాంతిని ఇయ్యకు.......
నిదుర తెరలుదాటి రాకు
ఊపిరే బరువుగా మిగిలె నాకు
ఏలనో ఈమౌనసమరంలో
గుండెలో రగిలేటి గాయాలు...
చుక్కలెన్నివెలుగులుచిమ్మినా
నల్లని నిశిని వీడిపోలేవు
అడుగులెన్నిదూరాలు సాగినా
రాతను మార్చి పయనించలేవు
ఎదలో విరహపు వీణానాదం
బతుకులో అందని గమ్యస్థానం
ఆఖరివరకు వీడని భ్రమఇది
కాలమే ఆర్పని జ్వాలఇది
మరపురాని ఈమౌనరోదనలో
కన్నీరే తోడై నిలిచే నాకు
జ్ఞాపకమా!ఇకనైనా సెలవు తీసుకో
రగిలే గాయానికి శాంతిని ఇయ్యకు.......

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి