పచ్చనైన పనసను..
పిక్కలున్న పనసను..
చక్కనైన పనసను..
నన్ను చూస్తే మనసు జారును..
తినాలని నోరు ఊరును..
తొనలు గొంతులో జారును..
కోస్తే చేయి జారును..
ఒళ్ళంతా ముళ్ళు..
నా ఆకృతి, పరిమాణం చూసి
మిగతా పళ్ళన్నీ నాపై కుళ్ళు..
వేసవిలో విరగ కాస్తాను
ఉద్ధానంలో విరివిగా దొరుకుతాను..
భలే భలే పనసను
పచ్చనైన పనసను
పిక్కలున్న పనసను
చక్కనైన పనసను
కజ్జ పనస కమ్మనైన పనస..
బురద పనస పీచు పనస..
పంపర పనస, ఎన్నెన్నో నా పనసలు..
నా పనస పొట్టు కూర ఉంటే
పొట్ట పగిలేట్టు పడతారు ఓ పట్టు..
ఇది పసందైన వంట అందర్నీ ఆకట్టునంట..
భలే భలే పనసను
పచ్చనైన పనసను
పిక్కలున్న పనసను
చక్కనైన పనసను
పెళ్ళిళ్ళు, పండగలకు, పబ్బాలకు
ప్రత్యేక వంటగా..
పోషకాల పంటగా
పనసకాయ బిరియానీను..
ఫలములలో సత్యఫలంగా పేరైన పనసను..
వీణ, తబలా, మృదంగం
సంగీత వాయిద్య పరికరాల తయారీకి
పనికొచ్చే శ్రావ్యమైన కలపను..
భలే భలే పనసను..
పచ్చనైన పనసను..
పిక్కలున్న పనసను..
చక్కనైన పనసను..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి