తే:06.06.26ది :06.06.06
వివరణ:
6వ తేది
6వ నెల
26వ సంవత్సరం
6 గంటలు
6 నిమిషాలు
6 సెకన్లు
*పై విధంగా అన్ని ఆరులు రావడం ప్రతి పది సంవత్సరాలకు ఒక సారి వస్తుంది.
*మరల 2036 లో వస్తుంది.2016 లో వచ్చింది.
*2000 నుంచి 2099 వరకు గల శతాబ్దంలో చూస్తే మనకు ఆరులు ఆరు సార్లు అన్ని ఒకేసారి రావడం ఈ శతాబ్దములో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 10 సార్లు ఈ క్రింది సంవత్సరాల లో వస్తుంది.2006,2016,2026,2036,2046,2056,2066,2076,2086,2096 .
6 యొక్క ప్రత్యేకతలు
*మొదటి మూడు అంకెల మొత్తం,వాటి లబ్ధం నకు సమానం అయ్యే సంఖ్య కేవలం 6 మాత్రమే.
6=1+2+3=1×2×3
*మన మందరం ఆడే క్రికెట్ ఆటలో కూడ 6 ఇమిడి ఉంది. ఆరు బాల్స్ వేస్తే దాని ఒక ఓవర్ గా భావిస్తున్నాము.అలాగే ఒక బాల్ వేస్తే వచ్చే అత్యధిక రన్స్ కూడ 6 కావడం మరో ప్రత్యేకత.
*6ను పరిపూర్ణ సంఖ్య అంటారు.ఒక సంఖ్య యొక్క కారణాంకాలు మొత్తం ఆ సంఖ్య కు సమానమైతే ఆ సంఖ్యను పరి పూర్ణ సంఖ్య అంటారు. 6 కారణాంకాలు 1,2,3 వాటి మొత్తం 1+2+3=6. అతి చిన్న పరిపూర్ణ సంఖ్య అవుతుంది.
*ఉగాది పండుగ సందర్భంగా మనం చేసే ఉగాది పచ్చడిలో షడ్రుచులు సమ్మేళనం (ఉప్పు,తీపి,పులుపు చేదు,కారం,వగరు)లో 6 రుచులు ఉండడం మరో ప్రత్యేకత.
*మన తెలుగు సామెతలలో "ఆరు నూరైనా,నూరు ఆరైనా" నేను ఆ పని చేసి పెడతాను అంటున్నారు.
*ఆరుద్ర అనే మహిళ తన పేరులో (6ద్ర)6 ను దాచుకుంది.
*ఆరుకి,తొమ్మిదికి గల మధ్య సంబంధం చూద్దామా రండి.
*ఆరు నుంచి ఒక అక్షరం తీసి తొమ్మిది చేయడం.
SIX లో S అక్షరం తీస్తే రోమన్ అంకె IX మిగులుతుంది.
*తొమ్మిది కి ఒక అక్షరం చేర్చి ఆరు చేయడం.
IX కి S అనే అక్షరం ముందు చేర్చడం వలన SIX ఏర్పడును.
*మనం ఉత్తరాలు రాసినప్పుడు అడ్రస్ తో PIN code నంబర్ వేస్తాము.అందులో కూడ 6 అంకెలు మాత్రమే ఉంటాయి.
ఉదా: PIN: 532284
ఈరోజు తేది ప్రత్యేకత చూద్దామా రండి..: - మడ్డు తిరుపతిరావు -గణిత అవధాని & టీచరు -బూరగాం* కంచిలి*శ్రీకాకుళం-9491326473
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి