నిత్యం శ్రమించు శ్రామికులం మేంమాదినబత్యం అందించుమా జన జీవన ప్రేమికులం మేంవిశ్రమించకుండా శ్రమిస్తుంటాంరోజూ శ్రమిస్తూ మా మోజు తీర్చుకుంటూశ్రమ విభజనను మేం పంచుకుంటూమా భవిష్యత్తును మేం తీర్చిదిద్దుకుంటూకలసి మెలసి ఉంటాం మేం కాలం తో సాగుకుంటూ !శ్రమ గీతం పాడుకుంటూ సుఖ జీవనం కోరుకుంటూకమ్ముకున్న కారు చీకట్ల నుండి మేం కోలు కుంటూమేం ఉంటాం మా సుఖ సౌధాన్ని చేరుకుంటూహాయిగాను తీయగాను పాటలే పాడుకుంటూ !మనమంతా శ్రమిస్తేనే ఔతుంది వృద్ధి అభివృద్ధిమానవ మనోగమనంలోనూ పురోభివృద్ధిఈ వృద్ధి అభివృద్ధి సమృద్ధిగా మనం సరిదిద్దివిశ్వజనుల ముందు మన శ్రమ గీతం కావొద్దు రద్దీ !నీ శ్రమయే సంపదను సృష్టిస్తుందినీ రీతిని ఖ్యాతిని ప్రతిష్టింప చేస్తుందిఅందుకే నిరంతరం నీవు శ్రమించుజాతి సంపద పెంచి అందరికీ పంచు !
శ్రామికులం! ప్రేమికులం !: - గుర్రాల లక్ష్మారెడ్డి -సెల్.9491387977. కల్వకుర్తి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి