సోమరిపోతు కుందేలు: - వరుకోలు లక్ష్మయ్య -తెలుగు భాషోపాధ్యాయులు-జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల సిద్ధిపేట -చరవాణి:9704865816
 ఒక పీర్లపల్లి అడవిలో జిరాఫీ,ఏనుగు, కుందేలు అనే ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవి. జిరాఫీ ఎత్తుగా, ఏనుగు బలంగా ఉండేవి. కుందేలు మాత్రం చిన్నదైనా, చలాకీగా ఉండేది.
మొదట్లో కుందేలు కూడా తనకు తాను ఆహారం వెతుక్కొని తినేది.కానీ జిరాఫీ, ఏనుగు ప్రేమతో ప్రతిరోజూ ఆహారం తెచ్చిపెడుతుండటంతో కుందేలు అలవాటు పడిపోయింది.
“మన చిన్న స్నేహితుడే కదా!” అని జిరాఫీ నవ్వేది.
“ఇది ఆకలిగా ఉండకూడదు” అని ఏనుగు ప్రేమగా చూసుకునేది.
నిత్యం స్నేహితులు తెచ్చిచ్చే ఆహారం తిని సోమరిగా మారింది.
రోజంతా చెట్టు కింద పడుకుని ఉండేది.
రాత్రయ్యాక కూడా “ఆహారం తెచ్చారా?” అని ఎదురు చూసేది.
ఒకరోజు ఆలస్యమైతే కోపంగా,
“మీరు నా గురించి పట్టించుకోవడం లేదు!” అని స్నేహితులను తిట్టేది.
జిరాఫీ,ఏనుగు బాధపడ్డా ఏమీ అనేవి కాదు.
ఈ సంగతంతా అడవిలోని సింహం గమనించింది.
“ఇలా ఉంటే కుందేలు పూర్తిగా పనికిరానిదైపోతుంది… వీరికి గుణపాఠం చెప్పాలి” అని అనుకుంది.
ఒక రోజు సింహం గ్రద్దను పిలిచి,
“వెళ్ళి ఆ ముగ్గురినీ నా దగ్గరకు రమ్మని చెప్పు” అంది.
గ్రద్ద వెళ్లి చెప్పగా,జిరాఫీ, ఏనుగు వెంటనే వచ్చాయి. కానీ కుందేలు నడవలేక చాలా కష్టంగా ఆయాస పడుతూ వచ్చింది.
దాన్ని చూసి సింహం కోపంగా,
“ఇది ఏమిటి? నడవలేనంతగా ఎందుకు అయ్యింది?” అని అడిగింది.
జిరాఫీ,ఏనుగు తలదించుకుని,
“మేమే ఎక్కువగా చూసుకున్నాం” అని చెప్పాయి.
సింహం చిరునవ్వుతో,
“సరే! ఇక మీ అందరికీ ఒక పరీక్ష” పెడతాను అంది.
“ఈ రోజు నుంచి పది రోజుల పాటు ఎవరికీ ఎవరు సహాయం చేసుకోగూడదు.
ప్రతి ఒక్కరూ తమ ఆహారం తామే సంపాదించాలి.
అలా చేయలేకపోతే… అడవిలో ఉండటానికి హక్కు ఉండదు!” అని కఠినంగా చెప్పింది.
కుందేలు వణికిపోయింది.
“నేను ఎలా ఆహారం సంపాదించుకోవాలి?” అని ఏడ్చింది.
మొదటి రోజు కుందేలు ఆకలితో ఇబ్బంది పడింది.
జిరాఫీ,ఏనుగు చూసినా సహాయం చేయలేకపోయాయి.
ఆకలి ఎక్కువ కావడంతో కుందేలు నెమ్మదిగా బయటకు వెళ్లింది.
చిన్న చిన్న గడ్డి మొక్కలు, పండ్లు,దుంపలు వెతకడం మొదలుపెట్టింది.కష్టపడి కొంత ఆహారం సంపాదించింది.
అలా రోజు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆహారం సంపాదించుకొని తినసాగింది.
పదిరోజుల వరకు ఎవరిమీద ఆధారపడకుండా వేగంగా పరుగెత్తి పుష్టికరమైన ఆహారం సంపాదించుకొని తినసాగింది.కొన్ని రోజుల తరువాత సింహం మళ్లీ పిలిచింది.
“ఎలా ఉంది నీ అనుభవం?” అని కుందేలును అడిగింది.
కుందేలు ఆనందంగా,
“నేను స్వయంగా ఆహారం సంపాదించగలను.ఇప్పటి నుండి ఎవరిమీద ఆధారపడకుండా సోమరిగా ఉండను!” అంది.
“మేము ప్రేమతో చేసిన పని వలన కుందేలు సోమరిగా మారింది.మాది ముమ్మాటికి తప్పేనని ఒప్పుకున్నాయి. ఇకపై సహాయం చేస్తాం కానీ అలవాటు చేయ"మని జిరాఫీ,ఏనుగు నిర్ణయించుకున్నాయి.
సింహం సంతోషంగా వాటిలోని మార్పును మెచ్చుకుంది
“సరైన సహాయం అంటే ఇతరులను బలంగా చేయడం,
కానీ బలహీనులుగా కాదు” అని చెప్పింది.
ఆ రోజునుంచి కుందేలు కష్టపడి పనిచేసింది.
జిరాఫీ,ఏనుగు కూడా సరైన విధంగా స్నేహం చేయడం నేర్చుకున్నాయి.
అతిగా సహాయం చేయడం వల్ల మన స్నేహితులు బలహీనపడతారు.
స్వయంగా కష్టపడి సంపాదించుకోవడం నేర్పించడమే నిజమైన స్నేహం.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం