నేటి సామాజిక నైతికత : - -మిత్రాజి -( గుండవరం ప్రభాకర్ రావు పంతులు )-ఫోన్ నం. 9949267638


నైతికత..........
ఇప్పుడు పుస్తకాల పుటల్లో బంగారు అక్షరాలతో 
మెరిసే పదం; జీవితపు వీధుల్లో మాత్రం దుమ్ముతో కప్పబడిన అడుగు.

సత్యం మాట్లాడే గొంతుక చప్పట్లకన్నా
 ప్రశ్నలనే ఎక్కువ ఎదుర్కొంటోంది.
నిజాయితీకి ధర లేదు అంటారు, 
కానీ దాన్ని అమ్ముకునేవారికే ధరలు పెరుగుతున్నాయి.

మనిషి విలువను మనసుతో కాదు, 
హోదాతో కొలుస్తున్న కాలం ఇది. 
మాటలలో మానవత్వం, చేతలలో స్వార్థం.సంబంధాలు 
రక్తంతో కాదు, అవసరాలతో ముడిపడుతున్నాయి.

ప్రేమకు కూడా లాభనష్టాల లెక్కలు రాస్తున్న యుగం.
అయినా... చీకటంతా సూర్యుడిని మింగలేదు.
 ఒక నిజాయితీ మనిషి ఉన్నంత వరకు, 
ఒక కరుణ హృదయం కొట్టుకునేంత వరకు, 
ఒక చేయి మరొక చేయిని ఆదుకునేంత వరకు—
నైతికత చనిపోలేదు.

అది ప్రతి మంచి ఆలోచనలో, ప్రతి నిస్వార్థ చర్యలో, ప్రతి న్యాయమైన నిర్ణయంలో మళ్లీ పుడుతూనే ఉంటుంది.

సమాజాన్ని మార్చేది చట్టం మాత్రమే కాదు... మనిషి మనసులో మేల్కొనే నైతికత కూడా.

కామెంట్‌లు