గురువు చెప్పిన సత్యాలు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
చేరాలంటే లక్ష్యము 
రావాలంటే విజయము 
పట్టుదల కావాలోయ్!
గుండె ధైర్యం ఉండాలోయ్! 

గెలవాలంటే మనసులు 
కురియాలి ప్రేమ చినుకులు 
వెలగాలంటే ముఖములు 
విరియాలి నవ్వుల పూలు 

బలపడాలంటే బంధము 
నిలవాలంటే స్నేహము 
నమ్మకమే తొలిమెట్టు 
అదే అదే చూపెట్టు 

కావాలంటే అభివృద్ధి 
జీవితాల్లో సమృద్ధి 
కష్టించే తత్వమే 
అత్యంత ప్రాముఖ్యమే 


కామెంట్‌లు