ఉగాది పండుగ: - ఆకారం త్రిశాంజలి-9వ, తరగతి -జి.ప.ఉ.పా:బక్రిచెప్యాల
 

చింటూ, బంటూ ఇద్దరు అన్నదమ్ములు.ప్రొద్దునలేచి మామిడాకులతో తోరణాలు కట్టి,అడవికి వెళ్లి మర్రిఆకులు,మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు తీసుకవచ్చారు.కుమ్మరింటికి వెళ్లి కొత్త కుండ తెచ్చారు. కొత్త బట్టలు వేసుకుని గుడికి వెళ్తున్నారు.మార్గమధ్యంలో 
“బంటూ! ఉగాది ఎందుకుంటాం"అని చింటు అడుగుతాడు.
బంటూ చిరునవ్వుతో ఇలాచెప్పాడు,
ఉగాది అనేది ఈ యుగానికి ఆది అంటే మొదటి పండుగ అని అర్థం.
“ఉగాది అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం.ఈ రోజు నుంచి కొత్త ఆశలు,కొత్త ఆశయాలతో ముందుకు సాగుతారు.”
“అయితే ఉగాది పచ్చడి ఎందుకు తింటారు?”అని చింటూ అడిగాడు.
“ఉగాది పచ్చడిలో తీపి, చేదు,పులుపు,వగరు,ఉప్పు,కారం అనే ఆరు రుచులు ఉంటాయి. మన జీవితంలో సంతోషం,బాధ,విజయం, అపజయం అన్నీ ఉంటాయి. వాటిని ధైర్యంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి చెబుతుంది,”అన్నాడు బంటూ.
అది విన్న చింటూ ఆనందంగా,
“ఉగాది మన తెలుగువాళ్లకు మంచి పండుగ అన్నమాట!” అన్నాడు.
“అవును! కొత్త సంవత్సరం మంచిపనులతో ప్రారంభించాలని గుర్తు చేసే పండుగే ఉగాది,”అని బంటూ చెప్పాడు.
ఇద్దరూ సంతోషంగా గుడికి వెళ్లి దేవున్ని మొక్కుకున్నారు.
ఇంటికి వచ్చి అమ్మ చేసిన భక్ష్యాలను తిన్నారు. పంచాంగం చూపించు కున్నారు.
ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
కామెంట్‌లు