నీ గూనికి తగిన బంగారు తొడుగునిచ్చెద
నీకు రత్న, ముత్యాల ఆభరణాలను
మంగళకరమైన వస్త్రములు ఇచ్చెదను
మంథర కైకేయి చెప్పిన మాటలన్ని విని
సమయము గతించిపోతుంది
ఓ తల్లి లెమ్ము నే చెప్పినట్లు వినుము
కోపగృహమున రాజుకై ఎదురు చూడు
ఓ కైకేయి అభరానములన్ని తొలగించి
మలిన దుస్తులను ధరించి వెళ్లుము
రాజు నీ వద్దకు రాగానే ఇలా పలుకు
రాముని అడవికి పంపకుంటే నేనుండను
అన్న పానీయాలను స్వీకరించను
నేను ఈ భూమి పైన జీవించి యుండను
నాడు నీవు ఇచ్చిన రెండు వరములను
మాట తప్పకుండా ఇవ్వుము రాజా
నీ పతిని నీవు ఇలా గట్టిగా కోరుము
అప్పుడే భరతుని పట్టాభిషేకమవుతుంది
కైకేయి హారములన్నియు తొలగించి
మలిన దుస్తులతో కోపగృహమునకెళ్ళింది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి