వేసవి సెలవుల్లో నేను .. : రమేష్9 వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామం రేగులపల్లి -మండలం బెజ్జంకి -జిల్లా సిద్దిపేట
  నేను వేసవి సెలవుల మొదటి రోజు 24వ తేదీ నుండి మా గ్రామం రేగులపల్లిలోని ఉన్నాను. టీవీ చూస్తూ, ఆటలు ఆడుతూ కాలక్షేపం చేశాను. తేదీ 26 ,27, 28 తేదీలలో ఎల్లమ్మ జాతర జరిగింది. 29న డిన్నర్ జరిగింది. 30 31వ తేదీన మా అన్న వాళ్ళ ఇంటికి పోయాను. అక్కడి నుండి రెండవ తేదీ స్వర్ణగిరికి వెళ్లాను. అక్కడ దేవాలయం చాలా బాగా ఉంది. రెండవ తేదీన యాదగిరిగుట్టకు వెళ్ళిన అక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చాలా బాగుంది.ఆ తర్వాత మా అన్న దగ్గర రెండు   వారాలు ఉన్నాను. ఆ తర్వాత మా పిన్ని దగ్గరకు వెళ్లిన అక్కడ మా బాబాయితో కలిసి సేవకు విజయవాడకు వెళ్లాను. అక్కడ కనకదుర్గ అమ్మవారి దగ్గర మనీ కౌంటింగ్ చేశాడు. మా బాబాయ్ నేను మా బాబాయి వెంట అక్కడికి వెళ్లి ఆ కౌంటింగ్ చూస్తూ ఉండిపోయాను.అది అయిపోయాక దర్శనముకు వెళ్లాము. ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చాము మరుసటి రోజు బాబాయితో కలిసి సిరిసిల్లకు వెళ్లాను అక్కడ బట్టలు షాపింగ్ చేసి అయిపోయిన తర్వాత బిర్యానీ తిని ఇంటికి బయలుదేరాము. ఆ తర్వాత బాయి కాడికి వెళ్లి పొలం దున్ని పెసర్లు అలికి నీళ్లు పారించి  మామిడికాయలు తెంపుకొని ఇంటికి వచ్చాము. వడ్ల దగ్గరికి వెళ్లి పరదాలు మంచిగా ఉన్నాయా లేదా అని చూశాం. మళ్లీ ఒక రోజు కొండగట్టులో కౌంటింగ్ కు వెళ్లాలని అనుకున్నాడు బాబయ్ కానీ కుదరలేదు. ఒక రోజులో వడ్లు పోతాయి అనగా జోర సంచులు తిర్లమర్ల తీయటానికి వెళ్ళినాము.తీసినంక వడ్లు జోకినారు. జోకి లోడింగ్ చేశారు. కొన్ని రోజులు మా చెల్లెలితోపాటు ఆనందంగా గడిపాను మా అన్న వచ్చాడు .మా అన్న వచ్చిన తర్వాత రెండు మూడు రోజులు అక్కడనే ఉండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి మా అన్న తాతతో కలిసి వెళ్లాం. కానీ అక్కడ ప్రధాన ఆలయం రాజేశ్వర స్వామి ఆలయం కొత్తగా నిర్మిస్తున్నందున భీమేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం దర్శనం కల్పించారు. అక్కడ గుండు గీయించుకొని గుండంలో స్నానం చేసి దర్శనం లైను కట్టాము. గంటలోనే దర్శనం అయింది .అక్కడ దర్శనం చేసుకుని పక్కనే ఉన్న బద్ది పోచమ్మ అమ్మవారి దగ్గర లైన్ ఎక్కువగా ఉండటం చూసి బయటనే కొబ్బరికాయ కొట్టి టిఫిన్ చేసి ప్రసాదం కు లైన్ కట్టాము. ఒక గంట నిలబడి టికెట్ తీసుకున్న అలాగే పులిహోర రెండు లడ్డూలు తీసుకున్నాము. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి బాబాయి వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ రెండు రోజులు ఉండి మా ఇంటికి వచ్చాను.మా అన్న మా ఇంటికి వచ్చాడు. వచ్చినంక ఒకరోజు తర్వాత కోడి తెచ్చుకుని దుర్గమ్మ దగ్గర కోడి కోసి వండి తిన్నాం. మా అన్న రెండు మూడు రోజులు ఉండి వెళ్ళిపోయాడు ఇలా సెలవులు ఆనందంగా గడిచాయి 15వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం