ప్రతి క్రిస్మస్ రోజున, ప్రపంచంలోని చాలా మంది బహుమతులు ఇచ్చుకుంటూ విందు వినోదాలతో ఆనందంగా గడటం సర్వసహజం. కానీ, పెరూవియన్ ఆండీస్‌లోని ఒక చిన్న పట్టణంలో మాత్రం ఆరోజు భిన్నంగా గడుస్తుంది. ఆ సంవత్సరపు గొడవలను, నిజమైన పోరాటాలతో పరిష్కరించుకుంటుంది.
ఆ పట్టణం పేరు శాంటో టోమాస్. ఇది కుస్కో సమీపంలోని మారుమూల చుంబివిల్కాస్ ప్రావిన్స్‌లో ఉంది. ప్రతి డిసెంబర్ 25 వ తేదీన, అక్కడి నివాసులు 'తకనకుయ్ Takanakuy
అనే సంప్రదాయం కోసం గుమిగూడతారు. ఇది "ఒకరినొకరు కొట్టుకోవడం" అని అర్థం వచ్చే ఒక క్వెచువా పదం.
దీని వెనుక ఉన్న ఆలోచన ఆసక్తికరమైనది. ఈ సంవత్సరం మీకు ఎవరితోనైనా గొడవ ఉంటే, అది ప్రేమశవ్యవహారమైనా, భూమి తగాదా అయినా, కుటుంబ కలహాలైనా, బాస్‌తో సమస్య అయినా దాన్ని కోర్టుకు తీసుకెళ్లరు. దాన్ని రింగ్‌లోకి తీసుకెళ్తారు. బహిరంగంగా. అదీనూ క్రిస్మస్ రోజున మొత్తం సమాజం ముందుకి.
పోరాటాలకు కచ్చితంగా రిఫరీలే ఉంటారు. కొరుక్కోవడం, కింద పడి ఉన్నవారిని కొట్టడం, ఆయుధాలు వంటివి ఉండవు. ప్రత్యర్థులను వయస్సు, లింగం, శరీరాకృతి ఆధారంగా జత చేస్తారు. ఇక చాలా మందిని నిశ్చేష్టులను చేసే విషయం ఇక్కడ ఉంది.
ప్రతి ఒక్క పోరాటం కరచాలనంతో లేదా ఆలింగనంతో ముగుస్తుంది. వివాదం ముగిసినట్లు ప్రకటిస్తారు. అనంతరం ఎలాంటి మచ్చ లేకుండా బయటకు వెళ్ళిపోతారు.
పురుషులు పోరాడుకుంటారు.
స్త్రీలు పోరాడుకుంటారు.
యజమాని ఉద్యోగితో పోరాడుతాడు. అక్కాచెల్లెళ్లు ఒకరితో ఒకరు పోరాడుకుంటారు.
ఆ రింగ్ లోపల సామాజిక హోదాకు ఏమాత్రం విలువ ఉండదు.
అనంతరం, అదంతా పూర్తయ్యాక — అక్కడ సంగీతం, నృత్యం, చిచా (ఒక రకమైన జానపద గీతం), సంబరాలు ఉంటాయి.
దీని ఉద్దేశ్యం హింస కాదు. దానికి పూర్తి వ్యతిరేకం. నియంత్రిత, బహిరంగ, మధ్యవర్తిత్వంతో కూడిన వాతావరణంలో మనస్పర్థలను బయటపెట్టడం ద్వారా, ఆ సమాజం ఒక స్వచ్ఛమైన మనసుతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఎలాంటి పగలు ఉండవు. లోలోపల రగులుతున్న అసంతృప్తులు ఉండవు. మరో పన్నెండు నెలల పాటు సంబంధాలను నిశ్శబ్దంగా విషపూరితం చేసే పరిష్కారం కాని ఉద్రిక్తతలు ఉండవు.
తకనకుయ్ గురించి వార్తలు రాసిన పరిశోధకులు, పాత్రికేయులు స్థిరంగా గమనించే విషయం ఒక్కటే : గాయాలు తగిలినా, ఆ సమాజం మరింత ఐక్యంగా బయటపడుతుం ది. ఈ కార్యక్రమానికి హాజరైన లిమాకు చెందిన ఒక న్యాయశాస్త్ర విద్యార్థి ఇలా అన్నారు — "ఇందులో పాల్గొన్న వారికి తక్షణమే ఒక మానసిక ప్రక్షాళన కలుగుతుంది. ఈ ఉత్సవం ముగిసేసరికి ఎంతమంది ముఖాలపై గాయాలు, రక్తపు మరకలతో ఉన్నప్పటికీ, దానివల్ల సమాజం మరింత ఐక్యంగా, శాంతియుతంగా ఉంటుంది."
తకనకుయ్ సంప్రదాయం పురాతనమైనది. ఇది స్పానిష్ వలస పాలనను తట్టుకుని నిలబడింది. ఈ కార్యక్రమాన్ని మీడియా భారీ ఎత్తున చిత్రీకరిస్తుంది. ఇది ఇప్పటికీ ప్రతి క్రిస్మస్ రోజున జరుగుతుంది. ఎందుకంటే ఇది పనిచేస్తుంది.
కొన్నిసార్లు అత్యంత నిజాయితీ గల సమాజాల పునాదిపైనే అత్యంత శాంతియుతమైన సమాజాలు ఏర్పడతాయనడానికి ఈ విచిత్రమైన సంప్రదాయం ఓ గొప్ప ఉదాహరణ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి