ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ లో ఎగ్జిబిషన్ జరిగింది. ముఖ్య అతిధిగా సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ శ్రీమతి కళా చక్రపాణి విచ్చేశారు. ఆత్మీయ అతిధిగా శ్రీమతి ఆకుల స్వప్న కాన్సిలర్ విచ్చేశారు.
ప్రముఖ బాలసాహీతివేత్త చిత్రకళాకారిణి డాII కందేపి రాణీప్రసాద్ పర్యావరణానికి సంబంధించిన 650 చార్టులను ప్రదర్శించారు. పర్యావరణ సంరక్షణ కొరకు ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ చేసి టీచింగ్ ఎయిడ్స్ గానూ, కళా ఖండాలుగానూ, అలంకార వస్తువులు గానూ రూపొందిస్తున్నారు. ఆసుపత్రిలో వచ్చే, పారవేసే వ్యర్థ ప్లాస్టిక్ పదార్థాల తోటి అనేక బొమ్మలు చేయడం రాణీప్రసాద్ కు అలవాటే. వీటిని చూసిన మున్సిపల్ ఛైర్మన్ జిందం కళ మాట్లాడుతూ “ఇలాంటి వాటిని ప్రతి స్కూలు పిల్లల దగ్గరకు తీసుకు వెళితే బాగుంటుంది. వాటిని నేర్చుకుని పిల్లలు కూడా ఇటువంటి వాటి పట్ల ఆసక్తి చూపుతారు. పిల్లలకు సిలబస్ గా ఈ కళను చేర్చాలని విద్యాశాఖను కోరుకుంటున్నానని అన్నారు”. కార్యక్రమంలో డాII కందేపి ప్రసాదరావు, డాII కందేపి స్వాప్నిక్, కె. సృజన్ సింధూర్, సిబ్బంది, పేషెంట్లు పాల్గన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి