తెలుగు భాష: - జె.నిర్మల-తెలుగు భాషోపాధ్యాయురాలు-జి.ప.ఉ.పా రామంచ-మం.చిన్నకోడూరు-జి.సిద్దిపేట


 తెలుగులో వెలుగులు విరజిమ్మురా
తెలుగు భాష తియ్యదనము తెచ్చుకున్న తేనె
తేనె తిన్న నాలికెపుడు తెలుగెందుకు పలకదు
సుస్వరాల త్యాగయ్య కను వెలుగు తెలుగు
అన్నమయ్య పదసవ్వడి మధురమైన తెలుగు
పోతన్న పోత పోసె ముత్యాల తెలుగు
శ్రీనాథుని కలములో జాలువారిన తెలుగు
నన్నయ నేర్పించిన నడకలే తెలుగు
తిక్కయ్య కలములో తేనెలూరిన తెలుగు
శ్రీ శ్రీ కలములో వెల్లువైనది తెలుగు
నండూరి ఎంకికి వెలుగునిచ్చిన తెలుగు
ముత్యాల సరములో ముత్యమైనది తెలుగు
పాలగుమ్మి వారికి ఖ్యాతి తెచ్చినది తెలుగు
కృష్ణ రాయనోట లెస్సన్నది తెలుగు
తెలంగాణ భూమిలో విప్లవించినది తెలుగు
భరతమాత కంఠానికి పచ్చల హారం తెలుగు
అందరి హృదయాలనుఅలరించినది తెలుగు
తెలుగును రక్షించుదాం
తెలుగు భవితకు బాటలు వేద్దాం
కామెంట్‌లు