:సంధ్యా సమయంలో....!!: - యెనుముల వేణుగోపాలరావు , అమలాపురం.

 సాయంత్రం వీచే చల్లగాలి తగిలి ,
ఉరకలేస్తుంది నామది గాలిలో తేలి ! 
సంధ్యా సమయంలో చూస్తే నీలాకాశం ,
నా మనస్సుకు కలుగుతుంది ఎంతో ఉల్లాసం !
గోదారి గట్టు మీద కూర్చుని చూస్తుంటే గోదారి వయ్యారాలు ,
వర్ణించగలవా _
నామనస్సు చేసే యవ్వారాలు ?
గూటికి చేరడానికి ఆకాశంలో ఎగిరే గువ్వలు ,
గమ్యం చేరటానికి వచ్చే తెరచాప నావలు !
నింగి అందాలను తనలో ఇముడ్చుకుని _
వయ్యారంగా వడ్డుకు చేరే అలలు ,
అలల తాకిడికి 
కడిగిన ముత్యాల్లా 
మెరిసిపోయే గులకరాళ్ళు ,
కనుచీకట్లో శబ్దాలు చేసే కీచురాళ్లు !
అస్తమించే సూర్యుని అందాలు ,
తొంగి చూచే చంద్రుని చందాలు ,
చూస్తే నా మనస్సులో 
పలుకుతాయి సుస్వరాలు ! 
ఇవి మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలు !
ప్రకృతి అందాలు చూసి తరించాలి మరి తరతరాలు !!
               ***
కామెంట్‌లు