పచ్చని పలుకులు: - డా. ధనాశి ఉషారాణి
 అరవిచ్చిన అందాల లోగిలిలో చిలకలo 
పచ్చని పల్లకిలో ఊరేగేటి ఊహాలo 
కమ్మని కలలకు నిండు వారసులo 
ఆడుతూ పాడుతూ మురిసేటి నవ్వులo 
జాబిలి లోగిలిలో నిదురించే జేగంటలం
వెన్నెలతో సయ్యాటలాడే ముద్దబంతులo 
ముద్దు ముద్దుగా  మురిసేటి పువ్వులo 
కోటి నవ్వులతో తుళ్ళిపడే మురిపాలo 
నింగికి నిచ్చెన వేసేటి నెమలి నాట్యాలo 
 భవితను దిద్దే పసిడి నవ్వులo 
జగతిలోవెలుగు నింపు మువ్వలo 


కామెంట్‌లు